లైఫ్ లో ఒక్కసారైనా చూడాల్సిన బ్యూటిపుల్ బ్రిడ్జ్ లు..  ఆ సిటీలోనే ఎక్కువ!

ఖాళీ దొరికితే చాలా మంది వెకేషన్స్​కు ప్లాన్ చేస్తుంటారు. ఎక్కడికి వెళ్లాలి? ఏయే ప్లేసెస్​ను ఎక్స్​ప్లోర్ చేయాలో ముందే ప్రణాళిక రెడీ చేసుకుంటారు.

హాలీడే ట్రిప్స్​లో భాగంగా కొందరు టెంపుల్స్​కు వెళ్లి భక్తి పారశ్యంలో మునిగిపోతారు. ఇంకొందరు బీచ్​లు, పర్వతాలు అంటూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు.

ఆలయాలు, బీచ్​లు, పర్వతాలు, లోయలు లాంటి వాటితో పాటు టూరిజంలో ఎక్స్​ప్లోర్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.

టూరిజం ప్లేసెస్​లో బ్రిడ్జ్​లు కూడా ఒకటి. చెరువులు, నదులపై నిర్మించిన వంతెలను చూసేందుకు టూరిస్టులు ఎగబడుతుంటారు.

కొన్ని వంతెనలు ప్రయాణాలు, వస్తు రవాణా కోసం కట్టినవి అయితే.. మరికొన్ని టూరిజం కోసం కట్టినవి. ఈ నేపథ్యంలో మన దేశంలో మోస్ట్ స్టన్నింగ్ బ్రిడ్జ్​లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

 బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ల్లో డార్జిలింగ్ లోని కొరొనేషన్ బ్రిడ్జ్ ఒకటి. దీన్ని సేవోక్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఇది వెస్ట్ బెంగాల్ కు సమీపంలో ఉంది.

కోల్ కతాలోని ఐకానిక్ హౌరా బ్రిడ్జ్ గురించి అందరికీ తెలిసిందే. హుగ్లీ నదిపై నిర్మించిన ఈ వంతెన చాలా అందంగా ఉంటుంది. ప్రత్యేకమైన డిజైన్ తో సిటీకి సింబల్ గా నిలిచేలా దీన్ని కట్టారు.

దేశంలోని ఆఖరి నగరమైన రామేశ్వరాన్ని ఇతర ప్లేసెస్​తో కనెక్ట్ చేసేలా కట్టిన బ్రిడ్జే పంబన్. సముద్రం మీద నిర్మించిన ఈ వంతెనను ఇంజినీరింగ్ మార్వెల్​గా ఎక్స్​పర్ట్స్ చెబుతుంటారు.

రిషికేష లోని లక్ష్మణ్ ఝూలా బ్రిడ్జి కూడా చూడదగ్గ వాటిల్లో ఒకటి.

కోల్ కతాలోనే మరో ఫేమస్ బ్రిడ్జ్ ఉంది. అదే విద్యాసాగర్ సేతు.  కేబుల్స్ తో నిర్మించిన ఈ బ్రిడ్జ్ ను రెండో హుగ్లీగా పిలుస్తారు. ఆసియాలోని అత్యంత పొడవైన బ్రిడ్జ్ ల్లో ఇదొకటి.

దేశంలోని అత్యంత పొడవైన రివర్ బ్రిడ్జ్ ల్లో ఒకటి బిహార్ లోని మహాత్మా గాంధీ సేతు. ఆ రాష్ట్ర రాజధాని పట్నాను హాజీపూర్ తో కలుపుతుందీ బ్రిడ్జ్.

అందమైన వంతెనల్లో ఒకటిగా గోవాలోని దూద్ సాగర్ వియాడ్కట్ ను చెప్పొచ్చు. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ మీదుగా నిర్మించిన ఈ బ్రిడ్జ్ పై ప్రయాణిస్తూ ప్రకృతి ఆందాలను ఆస్వాదిస్తే కలిగే అనుభూతే వేరు.

ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా-వోర్లీ సీ-లింక్ బ్రిడ్జ్ కూడా చూడదగ్గ వంతెనల్లో ఒకటి.

ముంబైలోని బాంద్రా, వోర్లీ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన ఈ బ్రిడ్జ్.. మోడర్న్ ఇంజినీరింగ్ మార్వెల్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీనిపై ప్రయాణిస్తూ అరేబియా సముద్ర తీర అందాలను ఎంజాయ్ చేయొచ్చు.టి.