రింకూ సింగ్ కు అన్యాయం!

యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ ప్రస్తుతం టీమిండియాలో మారుమ్రోగుతున్న పేరు.

2023 ఐపీఎల్ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహించి అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

ఐపీఎల్ లో చూపిన ప్రతిభతో టీమిండియా జట్టులో చోటు సంపాదించాడు. 

తొలుత టీ20ల్లో, ఆ తర్వాత వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు రింకూ.

బీసీసీఐ తాజాగా తీసుకొచ్చిన కొత్త రూల్ కారణంగా రింకూ సింగ్ కు తీవ్ర అన్యాయం జరగనుంది.

BCCI తీసుకొస్తున్న కొత్త రూల్ ప్రకారం ఎవరైనా అన్ క్యాప్డ్ ప్లేయర్ రెండు ఐపీఎల్ సీజన్ల మధ్యలో టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ ఆడినా.. అతడి శాలరీ రెండో సీజన్ ఐపీఎల్లో పెరుగుతుంది. 

బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం అన్ క్యాప్డ్ ప్లేయర్లు భారత్ తరఫున ఒక్క మ్యాచ్ ఆడినా వారి వేతనం రూ.50 లక్షలు అవుతుంది. ఇక 5 నుంచి 9 మ్యాచ్ లు ఆడితే 75 లక్షలు, 10 మ్యాచ్ లు ఆడితే కోటి రూపాయాలు అవుతుంది. 

ఈ చొప్పున ఇప్పటికే రింకూ జీతం 2024లో కోటి రూపాయాలు కావాలి. కానీ కాలేదు. ఎందుకంటే? ఈ కొత్త రూల్ ప్రకారం అన్ క్యాప్డ్ ప్లేయర్ కనీస వేతనం రూ. 50 లక్షలు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. 

రింకూ సింగ్ ఐపీఎల్ శాలరీ రూ. 55 లక్షలుగా ఉంది. ఇదే ఇప్పుడు అతడికి మైనస్ గా మారింది. దీంతో కోటి రూపాయాలు కావాల్సిన అతడి జీతం అలాగే ఉండనుంది.

ఒకవేళ బీసీసీఐ ఈ నిబంధనల్లో మార్పులు చేస్తే.. రింకూ శాలరీ పెరుగుతుంది.