దోమలు కుడుతున్నాయా? ఇలా చేస్తే కుట్టవు తెలుసా!

మరికొన్ని రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కాబోతుంది.

దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు గురవుతున్నారు.

దోమలు కుట్టకుండా ఉండాలంటే వీటిని తింటే చాలు మీ సమస్య తీరినట్టే.

నిమ్మకాయలు, నారింజ, కివీ, ద్రాక్ష పండ్లలో విటమిన్ సీ తో పాటు ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి.

వీటిని తినడం, వాటి తొక్కలను శరీరానికి పూసుకోవడం వల్ల దోమల నుంచి రక్షణ లభిస్తుంది.

వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. సల్ఫర్ దోమలను దూరంగా ఉంచుతుంది.

వెనిగర్ ను నీటిలో కలిపి స్ప్రే చేసుకుంటే దోమలు కుట్టవు.

తులసి ఆకుల నుంచి వచ్చే వాసన దోమలు కుట్టకుండా చేస్తుంది.

దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలను తీసుకోవడం వల్ల దోమలు కుట్టవు.

క్యాప్సికంలో క్యాప్సిసైన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది దోమలను తరిమి కొడుతుంది.

ఉల్లిపాయ తినడం ద్వారా దోమ కాటుకు దూరంగా ఉండొచ్చు.

పుదీనా ఆకులను తినడం ద్వారా దోమల సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం