Thick Brush Stroke

తిన్న వెంటనే వాకింగ్‌ చేస్తున్నారా? అయితే చాలా ప్రమాదం!

చాలా మందికి కొంచెం ఆహరం తీసుకున్నా కానీ.. కడుపు నిండుగా అనిపిస్తూ ఉంటుంది.

ఎక్కువ ఆహారాన్ని తినడం వలన కానీ, వేగంగా తినడం వలన కానీ.. ఇలా అనిపిస్తూ ఉంటుంది.

కడుపు ఉబ్బరాన్ని కనుక పట్టించుకోక పోతే.. ఇది అనేక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.

ఈ సమస్య నుంచి దూరం కావడానికి చిన్న చిన్న చిట్కాలను  పాటిస్తే సరిపోతుంది.

ఆహరం తీసుకునే ముందు కానీ, తర్వాత కానీ అధికంగా  పండ్లను తినకూడదు.

దీని వలన కడుపులో గ్యాస్ అనేది ఫార్మ్ అయ్యి.. కడుపు ఉబ్బరంగా కనిపిస్తుంటుంది. 

తిన్న వెంటనే కాకుండా.. తిన్న పది నిమిషాల తర్వాత వాకింగ్ చేయడం వలన ప్రయోజనం ఉంటుంది. 

అలాగే తిన్న తర్వాత సోడాలు, కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉంటె కనుక మానుకోవాలి.  

ఎందుకంటే వాటిలో కార్బన్ డయాక్సైడ్ ఉండడం వలన అవి కడుపులో గ్యాస్ ఫార్మ్ చేస్తాయి.

తినే సమయంలో సరిగ్గా నములుతూ తినాలి.. కనీసం 32సార్లు నమిలి తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు.

రాత్రి సమయాల్లో తేలికగా జీర్ణం అయ్యే ఆహార పదార్ధాలను తీసుకోవాలి. 

క్యాలి ఫ్లవర్, క్యాబేజి, ఉల్లిపాయ, వెల్లుల్లి, బటానీలు, దుంపలు  రాత్రి సమయాల్లో తినకపోవడం మంచిది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం