నెలల తరబడి ఒకే టూత్‌బ్రష్‌ వాడుతున్నారా..? అలా చేస్తే ఏం జరుగుతుందో తెలిసా!

శరీరంలో అన్ని అవయవాలతో పాటు నోరు కూడా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం

అందుకే ప్రతిరోజు చాలామంది ఉదయం, సాయంత్రం రెండుపూటల నోటితో పాటు దంతాలను కూడా  శుభ్రం చేసుకోవడం కోసం బ్రష్ చేస్తుంటారు.

అయితే ఇలా తరుచు బ్రష్ చేసే వారు టూత్ బ్రష్ ను కూడా మంచింది వినియోగించడం  చాలా ముఖ్యం.

ఎందుకంటే.. అది పాడైతే మీ దంతాలు దెబ్బతింటాయి. అనేక ఇతర నోటి సమస్యలు కూడా వస్తాయి.

అందుకే టూత్ బ్రష్ ఎప్పుడు మంచిదై ఉండాలి, శుభ్రంగా ఉండాలి.

సాధారణంగా ఒక బ్రష్‌ను మూడు నెలలకు మించి ఎక్కువగా ఉపయోగించకూడదని, ప్రతి డెంటిస్ట్ చెబుతుంటారు.

ఎందుకంటే.. అన్ని నెలలు వాడిన బ్రష్ పూర్తిగా పాడైపోయి ఉంటుంది. దీనివల్ల  పంటి నొప్పి, రక్తస్రావం సమస్యలను కలుగుతాయి.

అంతేకాకుండా ఎక్కువ రోజులు వాడిన టూత్ బ్రష్ వలన  వైరస్, బాక్టీరియా వంటివి నోటికి చేరుతాయి.

దీంతో తరుచు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతుంటారు.ముఖ్యంగా ఈ విషయంలో చిన్నపిల్లలైతే తొందరగా అనేక ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు.

అందుకే టూత్ బ్రష్ బ్రిస్టల్స్ మూడు నెలల ముందుగానే విరిగిపోయినా,  చిప్ అయినా సరే  వెంటనే ఆ బ్రష్‌ని మార్చేయాలి.

అలా చేయకుండా అదే బ్రష్ ను వినియోగిస్తే  కావిటీస్, చిగుళ్ల వ్యాధికి దారి తీసే అవకాశం ఉంటుంది.