బాత్రూంలో ఫోన్ ఉపయోగిస్తున్నారా..? అయితే డేంజర్ లో పడినట్లే

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అనేది అవసరం నుంచి అత్యవసరంగా మారిపోయింది.

ఈ క్రమంలోనే ఈ ఫోన్ ఈ వినియోగం అనేది ఒక వ్యసనలా మారిపోయింది.  

అది ఎంతలా అంటే  24 గంటలపాటు ఈ ఫోన్ అనేది చేతిలో లేకపోతే ప్రపంచం ఆగిపోయేంతగా ఫీల్ అవుతుంటారు.

చివరికి ఎంతాల అడిక్ట్ అయ్యారంటే..బాత్రూంకు వెళ్లిన ఫోన్ పట్టుకుని వెళ్లాల్సిందే.

చాలామంది ఇలా టాయిలెట్ లో ఇలా ఫోన్ చూస్తూ గంటల సమయం వరకు బయటకురారు.

కానీ,ఇలా చేయడం వలన చాలా సమస్యలు, ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.

ఒకవేళ మీరు కనుక ఇలా చేస్తున్నట్లు అయితే ఈ విషయం డేంజర్ లో పడినట్లే

ఎందుకంటే.. టాయిలెట్ లో ఫోన్ తీసుకెళ్లినప్పుడు  ప్రతి ఫ్లష్ బ్యాక్టీరియాను గాలిలోకి పంపుతుంది.

దీనివల్ల సాల్మోనెల్లా, ఇ.కోలి వంటి జెర్మ్స్‌తో మీ ఫోన్‌ను కవర్ అవుతుంది.

అలాగే  జెర్మ్స్ కడుపు ఇన్ఫెక్షన్లు,డయేరియా,ప్రేగు సంబంధిత వ్యాధులు,మూత్ర వ్యాధులు,అంటువ్యాధులు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ముఖ్యంగా ఈ టాయిలెట్ లో కంటికి కనిపించని బ్యాక్టరీయా అనేది ఎక్కువగా ఉంటుంది.

కనుక బాత్రురూమ్ లో ఫోన్ మాట్లాడిన, చూసిన ఆ బ్యాక్టిరియా అనేది ముక్కు, చెవులు వంటి రంధ్రాల నుంచి శరీరంలోకి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.