ఇయర్ ఫోన్స్, బడ్స్ ఎక్కువగా వాడుతున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే?

స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాక యూజర్లంతా  యర్ ఫోన్స్, బడ్స్ యూజ్ చేస్తున్నారు.

సాంగ్స్ వింటూ ఇయర్ ఫోన్స్ తో గంటల కొద్ది గడుపుతున్నారు.

జర్నీలో ఉన్నా, ఆఫీసుకు వెళ్లినా, ఆఖరికి ఇంట్లో ఉన్నా కూడా ఇయర్ ఫోన్స్ చెవుల్లో ఉండాల్సిందే.

అయితే ఇయర్ ఫోన్స్, బడ్స్ ఎక్కువ గా వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా వినికిడి శక్తిని కోల్పోవడం జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇయర్ ఫోన్స్ పెట్టుకుని గంటల కొద్ది సాంగ్స్, కాల్స్ మాట్లాడటం మంచిది కాదంటున్నారు.

ఇలా చేయడం వల్ల తలనొప్పి, చెవి పోటు, చిరాకు, చెవుడు వచ్చే ప్రమాదముందంటున్నారు.

60 డెసిబిల్స్ కంటే ఎక్కువ శబ్దం డైరెక్ట్‎గా వినడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.

70 నుంచి 80 డెసిబిల్స్ మధ్య సౌండ్ తో వినడం వల్ల కర్ణభేరి దెబ్బతిని చెవుడు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇయర్ ఫోన్స్, ఇయర్ బడ్స్ వీలైనంత తక్కువ సమయం, తక్కువ సౌండ్ తో వాడాలని సూచిస్తున్నారు.

ఇయర్ ఫోన్స్ అతిగా వాడి చెవుడు తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం