అరటి తొక్కను పడేస్తున్నారా?.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

అరటి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

పొటాషియం, ఫోలేట్, ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన అరటిపండ్లు జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి.

అరటి తొక్కతో కూడా అంతే స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.

అరటి తొక్కలలో కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ వంటి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి మీ శరీరం నుంచి టాక్సిక్ ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి.

పండిన అరటి తొక్కలు పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియంతో నిండి ఉంటాయి.

ఇవి మీ దంతాలపై ఉన్న పసుపు మరకలను తొలగించి తెల్లగా మార్చడంలో సహాయపడతాయి.

అరటి తొక్కలు సహజ పాలిషింగ్ ఏజెంట్‌గా పనిచేస్తాయి.

బూట్లు మెరిసేలా చేసుకోవాలంటే అరటి పండ్ల తొక్కలను వాడండి.

అరటిపండ్లలో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి చర్మాన్ని కాంతివంతంగా, తేమగా మార్చడంలో సహాయపడతాయి.

అరటిపండు తొక్కలు కంటి కింద ఉబ్బడం, నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి.

అరటి పండు తొక్క లోపలి భాగాన్ని తినడం వల్ల రాత్రిళ్లు మంచి నిద్ర పడుతుంది.

అరటి పండు తొక్కలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని తినడం వల్ల సాఫీగా మలవిసర్జన అవుతుంది.

అరటి తొక్కలోని పీచు పదార్థాలు గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం