చలిగా ఉందని  హీటర్ వాటర్ తో స్నానం చేస్తున్నారా.. అయితే చిక్కుల్లో పడినట్టే

ప్రస్తుతం వర్షకాలం కావడంతో ఎక్కడ చూసిన ఎడతెరిపిలేని వర్షాలు కురస్తున్నాయి.

దీంతో  బయట వాతవరణం కూడా చాలా చల్లగా మారిపోవడంతో ఇంట్లో టాంక్ వాటర్ కూడా చల్లగా ఉంటున్నాయి.

ఈ క్రమంలోనే  చాలామంది చల్లని నీటితో స్నానం చేయలేక వేడినీటి కోసం కొంతమంది గ్యాస్ , స్టౌ, గీజర్ ను ఉపాయోగిస్తే, మరి కొందరు హీటర్ ను వినియోగిస్తారు.

ఎందుకంటే అందరి ఇంట్లో అందుబాటులో తక్కువ ధరకు లభించేది ఈ హీటర్ మాత్రమే. పైగా తక్కువ సమయంలో నీళ్లు కూడా త్వరగా వేడి చేసుకోవచ్చు.

కానీ, ఇలా ఎలక్ట్రికల్ హీటర్ వాటడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా హీటర్ తో కాచిన నీటితో స్నానం చేయడం వల్ల శరీర సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయని వైద్యులు చెబతున్నారు.

ఇక హీటర్ వాటర్ తో స్నానం చేయడం వలన ప్రధానంగా దురద, పొక్కులు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుదట.

ఎందుకంటే ఈ  ఎలక్ట్రిక్ హీటర్లు వాడుతుండటం వలన  గాలిలో కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు రిలీజ్ అవుతాయని చెబుతున్నారు.

అలాగే ఈ హీటర్ వాటర్ కారణంగా తలనొప్పి, వికారం, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉందట.

దీంతో పాటు  గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సమస్యల ముప్పు పెరుగుతుందని నిపుణులు  సూచిస్తున్నారు.

ముఖ్యంగా నాణ్యత లేని హీటర్లు వాడడం ప్రమాదం ఉందని,ఒకవేళ హీటర్ ను వాడితే క్వాలిటీ వాడటం మంచిదని హెచ్చరిస్తున్నారు.