మొటిమలు డార్క్  సర్కిల్స్ తో బాధ పడుతున్నారా.. ఈ కషాయం తో వాటిని చెక్ పెట్టవచ్చు.

వేపాకు ఇది రుచికి చేదుగా ఉన్న దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఎలాంటి చర్మ సమస్యలకైనా వేపాకు అనేది ఓ దివ్య ఔషాధంలా ఉపయోగపడుతుంది.

ఇందులో విటమిన్‌-ఎ, సి, కెరొటినాయిడ్స్‌, లినోలియిక్‌, ఒలియిక్‌ లాంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి.

కనుక ముఖం పై ఉండే మొటిమలు, నల్లమచ్చలకు వేపాకు రసం చక్కని విరుగుడు.

అందుకోసం గుప్పెడు వేపాకులను నీళ్లలో వేసి మరగబెట్టి వడకట్టాలి.

ఆ వేపాకు కషాయన్ని ఓ సీసాలో భద్రపరిచి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు దూదితో తడిపి ముఖానికి మర్దన చేయాలి.

ఇలా చేయడం వలన చర్మం పై డెడ్ స్కిన్ తొలిగి ముఖం కాంతివంతంగా మారుతుంది

అంతేకాకుండా చర్మం పొడిబారి, తరుచుగా దురదలు పెడుతుంటే రోజు స్నానం చేసిన నీటిలో వేపాకు రసాన్నివేసుకొవచ్చు.

ఇక తరుచు జిడ్డు చర్మంతో బాధపడుతున్న వారు ఈ కషాయంతో మర్దన చేస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

వేపాకు కషాయం చర్మ సమస్యలకే కాకుండా ఆరోగ్యం సమస్యలకు కూడా ఉపాయోగపడుతుంది.

ఇక కడుపునొప్పితో బాధాపడినవారు కూడా ఈ వేపాకు రసాన్ని మింగితే తక్షణ ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.