కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడుతున్నరా.. అయితే ఈ జిల్లేడు చెట్టుతో చెక్ పెట్టండి

ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన అనేక చెట్లు, మొక్కల్లో జిల్లేడు చెట్టు కూడా ఒకటి.

కానీ కొందరు ఈ జిల్లేడు చెట్టును ప్రమాదకరంగా భావిస్తారు.

ఇక మరి కొందరు ఈ జిల్లేడు మొక్క ఔషధంగా భావించి ఆరోగ్యనికి మంచిందంటారు.

కొంతమంది మాత్రం ఈ జిల్లేడు చెట్లు పూలను దేవుడికి మాలగా పూజిస్తుంటారు.

కానీ, నిజానికి జిల్లేడు చెట్టులో అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టే ఔషధ గుణాలు ఉన్నాయి.

ముఖ్యంగా ఈ జిల్లేడు ఆకులు,వేర్లు,పూలు,విత్తనాలను ఆయుర్వేదంలో ఔషధంగా వినియోగిస్తారు.

అంతేకాకుండా.. ఈ జిల్లేడు మొక్క వలన  లక్షణాలతో మలబద్ధకం,విరేచనాలు,కీళ్ల నొప్పులు,దంత సమస్యలు వంటి ఇబ్బందులు తొలగిపోతాయి.

ఆయుర్వేదం ప్రకారం ఈ  జిల్లేడులో ఉన్న యాంటీ ఆక్సిడెట్లు,యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.

కనుక ఇవి శరీరం పై గాయాలు, కీల నొప్పులు,వాపులలను త్వరగా నయం చేయడంలో సహాయపడతాయి.

ముఖ్యంగా ఈ జిల్లేడు ఆకులను మొత్తగా రుబ్బి ఆ రసాన్ని ఒంటి మీద వాపులపై రాస్తే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఈ ఆకుల పేస్ట్ ని నుదిటి మీద అప్లై చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

ఇక ఫైల్స్ తో బాధపడే వారికి ఈ చెట్టు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

దీంతో పాటు ఆకు పువ్వు రసం మొటిమలు,దురద వంటి చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ జిల్లేడు ఆకు,పువ్వు రసాన్ని చెవిలో వేసుకోవడం వల్ల చెవి ఇన్ఫెక్షన్, మంట నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

కానీ, ఇవాన్ని నిపుణులు తెలిపిన సమాచారమే కానీ, వైద్యుని సలహా లేకుండా  ఏ ప్రయోగాలు  చేయకుడాదు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం