ఈస్ట్రోజన్ సమస్యతో బాధపడుతున్నరా.. అయితే ఇలా చేయండి

ఈస్ట్రోజన్ అనేది ఒక హోర్మోన్. ఇది మహిళల శరీరంలో సహజంగానే ఉత్తత్తి అవుతుంది.

ఇది మహిళల్లో  పీరియడ్స్, ఎముక ఆరోగ్యం, సంతానోత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది.

అయితే కొంతమంది మహిళలకు ఈ ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉండటంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి.

మరీ, ఈ హోర్మోన్ స్థాయిలను పెంచి ఆ సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిని పెంచడానికి ప్రతిరోజు ఆహారంలో అవిసె గింజలు, నువ్వులు, సోయాబీన్స్, చిక్పీస్ ను చేర్చుకోవాలి.

వీటితో పాటు సోయా పాలు, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కూడా రోజు తీసుకోవాలి.

ఎందుకంటే ఇందులో  ఫైటో ఈస్ట్రోజెన్లు పుష్కలంగా ఉండటమే కాకుండా.. ఈస్ట్రోజెన్ స్థాయిని పెంచుతాయి.

అలాగే ఈస్ట్రోజన్ స్థాయిని పెంచడానికి శరీరానికి వ్యాయామం కూడా చాలా ముఖ్యమైనది.

అందుకే ప్రతిరోజు యోగా, ధ్యానం, డీప్ బ్రీత్ వంటి వ్యాయామాలు కచ్చితంగా చేయాలి.

ఇక ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచడానికి సప్లిమెంట్స్ కూడా సహాయపడతాయి.

కానీ, ఏదేమైనా సప్లిమెంట్లను తీసుకునే ముందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం