అసిడిటితో బాధపడుతున్నారా.. ఈ డ్రింక్స్ తో చెక్ పెట్టండి

చాలా మంది జీర్ణ సంబంధిత వ్యాధి అయిన ఎసిడిటితో బాధపడుతుంటారు.

బిజి లైఫ్ లో టైముకు సరిగా తినకపోవడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ఎసిడిటికి కారణమవుతున్నాయి.

ఆహారం తిన్న తర్వాత జీర్ణాశయంలో మంట, ఛాతిలో మంటతో ఇబ్బంది పడుతుంటారు.

ఎసిడిటీ తరచూ గుండెలో మంట, అజీర్తి వంటి అనారోగ్యాలకూ దారితీస్తుంది.

ఎసిడిటి నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యులు సూచించిన మందులు వాడుతుంటారు.

ఎసిడిటీ సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని రకాల డ్రింక్స్ తీసుకుంటే చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.

రోజూ క్రమం తప్పకుండా సబ్జా గింజలు కలిపిన నీటిని తీసుకుంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

టేబుల్‌ స్పూన్ సబ్జా గింజలను లీటర్‌ నీటిలో వేసి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ఆ రసాన్ని రోజూ తీసుకుంటే మెరుగైన ఆరోగ్యం సొంతమవుతుందంటున్నారు.

టీస్పూన్ సోంపు గింజలను వేడి నీటిలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టిన నీటిని తాగితే ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది.

గ్లాసు చల్లని పాలు తాగడం వల్ల మీ పొట్టకు ఉపశమనం లభిస్తుంది . ఎసిడిటీ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

అల్లంలోని సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎసిడిటీని తగ్గిస్తుంది.

క్రమం తప్పకుండా నీరు త్రాగడం వల్ల ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందొచ్చు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం