ఫోన్ పౌచ్ లో డబ్బులు పెడుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?

నేటి ఆధునిక కాలంలో మనిషి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ ను వాడుతూనే ఉంటాడు.

కాల్స్ మాట్లాడటం, వాట్సాప్ వినియోగం, పాటలు వినడం, వీడియోలు,  సినిమాలు చూడటం వల్ల ఫోన్ బాగా హీట్ ఎక్కుతుంది.

అయితే ఆ వేడి కాస్త ఫోన్ ప్యానల్ నుంచి బయటకు వెళ్లిపోతుంది. కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది.

చాలా మంది ఫోన్ పౌచ్ వెనక భాగంలో కరెన్సీ నోట్లు, లేదా ఏటీఎం కార్డులు మరేదైనా కాగితాలు పెడుతూ ఉంటారు.

ఇలా పెట్టడం ఎంత డేంజరో తెలుసా? అది మీ ప్రాణాలకే ప్రమాదం. ఎలా అంటే?

స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే వారిలో కొందరు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను, మెట్రో కార్డులను, బస్ పాస్ లను, డబ్బులను ఫోన్ పౌచ్ వెనకాల భద్రపరుస్తూ ఉంటారు.

అయితే ఇలా భద్రపరిచే క్రమంలో ఫోన్ హీట్ కారణంగా అవి కాలిపోయి, ఫోన్ పేలిపోయే  ప్రమాదం ఉంది.

ఫోన్ వెనకాల ఇలా కరెన్సీ నోట్లు, కార్డులు ఉంచడం మూలంగా సిగ్నల్స్ ను సరిగ్గా స్వీకరించదు.

అదీకాక మీరు పౌచ్ వెనకాల భద్రపరిచిన కార్డులకు చిప్ లు ఉంటాయి. దీని వల్ల నెట్ వర్క్ సమస్యలు ఏర్పడతాయి.

ఫోన్ వేడెక్కి పేలిపోయే అవకాశాలు ఉండటంతో ఇలా పౌచ్ వెనకాల డబ్బులు, కార్డులు పెట్టే అలవాట్లను వెంటనే మానుకోండని సూచిస్తున్నారు నిపుణులు.