‘టీ' అని అతిగా మరిగిస్తున్నారా? ఈ  సమస్యలు వచ్చే అవకాశం ఉంది!

చాలా మందికి రోజు అనేది ఓ కప్పు టీ తాగడంతోనే ప్రారంభమవుతుంది

చక్కగా పాలతో చేసుకునే టీ అంటేనే చాలా మంది ఇష్టపడుతుంటారు

అయితే కొందరు టీ ని అదే పనిగా ఎక్కువ సార్లు మరిగిస్తుంటారు

అలా ఎక్కువ సార్లు మరిగించిన టీ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.

టీ ని నిరంతరం మరిగించడం వల్ల పాలలోని కాల్షియం,విటమిన్లు B12, C C వంటి క్షీణిస్తాయి

పాలను ఎక్కువగా మరిగించడం వల్ల మాడిన వాసనలాంటి వస్తాయి.

టీ ను అతిగా మరిగించడం వల్ల పాలలోని ప్రొటీన్ల డీనాటరేషన్ కు దారి తీస్తుంది

అలాంటి టీ తాగడం వలన అజీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మరిగించిన టీ తాగడం వల్ల కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలకు దారి తీస్తుంది.

టీ ని ఎక్కువగా మరిగించడం వల్ల దానిలో పీహెచ్ మారుతుంది.

అధిక ఉష్ణోగ్రత కారణంగా టీలో మెయిలార్డ్ వంటి హానికరమైన మిశ్రమాలను ఏర్పరుస్తుంది.

మరిగిన టీలో యాక్రిలామైడ్ వంటి క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయంట

ఎంత ఎక్కువగా మరిగిస్తే అంతలా క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

పై విషయాలు కొందరు ఆరోగ్య నిపుణులు ఇచ్చిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది.