జుట్టు రాలిపోతుందా.. అయితే ఈ కూరగాయ తింటే సరి

ఈ సీజన్‌లో విరివిగా లభించే కూరగాయాల్లో ఒకటి ఆకాకర

వీటిని కాకోర, కంటోల, బోడకాకర, కకోడ అని కూడా పిలుస్తారు.

కాకర కాయ తినలేని వాళ్లకు బెస్ట్ చాయిస్. అయితే ఇందులో  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

ఇందులో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

 రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.

జీర్ణక్రియ సమస్యలను తగ్గించడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్ దరి చేరనివ్వదు. గుండె ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుంది.

పోషకాలు జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడతాయి.

విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది

క్యాన్సర్ కణాల వృద్ధిని నిరోధించడంలో సహాయపడుతుంది బోడకాకర.

కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది అకాకర.

గర్భిణీలు, పాలిచ్చే బాలింతలు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం