పెరుగులో చక్కెర కలుపుకుని తింటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

పాలు, పాల ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

పెరుగు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

దీనిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా చేస్తుంది.

పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.

పెరుగులో చక్కెరను కలుపుకుని తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పెరుగులో చక్కెరను కలిపి తీసుకుంటే గ్లూకోజ్ స్థాయిలు పుష్కలంగా ఉంటాయి.

ఎండాకాలం పెరుగును తింటే హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటుగా ఎనర్జిటిక్ గా కూడా ఉంటారు.

పెరుగులో చక్కెరను కలుపుకుని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.

జీర్ణవ్యవస్థను  కూడా మెరుగ్గా పనిచేస్తుంది. దీనిలోని మంచి బ్యాక్టీరియా కొలాన్ క్యాన్సర్ బారి నుంచి రక్షిస్తుంది.

పంచదార పెరుగును మిక్స్ చేసి తింటే పొట్ట ఆరోగ్యంగా.. చల్లగా ఉంటుంది.

ఉదయం పూట తినడం వల్ల ఎసిడిటీ, కడుపులో చికాకు, మంట వంటి సమస్యలు తగ్గిపోతాయి.

పెరుగు పంచదార మిశ్రమం మెమోరీ పవర్ ను కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడేవారికి చక్కెర కలిపిన పెరుగు మంచి మెడిసిన్ లా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

మధుమేహ వ్యాధిగ్రస్తులు పెరుగు క్కెర మిశ్రమాన్ని వైద్యులను సంప్రదించిన తర్వాతే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం