చికెన్‌ లివర్‌ లొట్టలేసుకుంటూ తింటున్నారా? అయితే.. ఇది తెలుసుకోండి!

చాలా మంది చికెన్‌ను చాలా ఇష్టంగా తింటారు

అందులోనూ చికెన్‌ లివర్‌ను కూడా కొంతమంది బాగా ఇష్టపడతారు.

అలా చికెన్‌ లివర్‌ను తినే వాళ్లను కొంతమంది వద్దని వారిస్తూ ఉంటారు

చికెన్‌ లివర్‌ తింటే మంచిది కాదని.. కానీ, అందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి.

ఇతర మాంసంతో పోలిస్తే త్వరగా జీర్ణం అవుతుంది.

ఇందులో మంచి ప్రోటీన్‌ లభిస్తుంది. 

చికెన్ లివర్‌లో విటమిన్-A, B, ప్రోటీన్లు , మినరల్స్, ఐరన్, విటమిన్ B12, ఫొలేట్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 చికెన్‌ లివర్‌తో కంటి, చర్మ, రక్త హీనత సమస్యలు దూరం అవుతాయి.

చికెన్‌ లివర్‌లో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఐరన్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి.

రక్త హీనత తగ్గించడానికి సహాయపడుతుంది.

ఇందులో విటమిన్-K అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మ్యుఖ్యం.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం