ఆ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే డేంజర్ లో పడ్డట్లే!

తాజా పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు అన్న సంగతి మనకు తెలియనిది కాదు.

దాంతో మన రోజూవారి ఫుడ్ లో వాటిని భాగం చేసుకుంటాం.

అయితే కొందరు కొన్ని రకాల పండ్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు.

ముఖ్యంగా యాపిల్, అరటి, పుచ్చకాయ, దోస, జామ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే డేంజర్ అంటున్నారు నిపుణులు.

యాపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగితే.. కడుపు నొప్పి, దగ్గు వస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.

ఇక ఎన్నో పోషకాల నిలయం అయిన అరటిపండు తిన్న వెంటనే.. గుక్కెడు నీళ్లు కూడా తాగకూడదు.

ఇక పుచ్చకాయ, దోస కాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే.. అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.

జామకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే.. జీర్ణక్రియ మందగిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

అందుకే పండ్లు తిన్న తర్వాత ఓ పది నుంచి ఇరవై నిమిషాల తర్వాత నీళ్లు తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం