పరగడుపున టీ- కాఫీ తాగేస్తున్నారా? ఈ సమస్యలు కోరి తెచ్చుకుంటున్నారు!

ఉదయాన్నే లేవగానే చాలామందికి టీ- కాఫీ తాగే అలవాటు ఉంటుంది.

 ఇంకొంతమందికి ఖాళీ కడుపులో కాఫీ పడందే ఏ పనీ చేయరు.

నిద్రలేచే సరికి వేడి వేడిగా టీ/కాఫీ రెడీగా ఉండాలి.

అలా పరగడుపున టీ- కాఫీ తాగడం ప్రమాదకరమేమో అని ప్రశ్నించుకున్నారా?

పరగడుపున టీ/కాఫీ తాగడం చాలా ప్రమాదకరం.

ఆరోగ్య సమస్యలను కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది.

మీరు ఉదయం లేవగానే టీలు కాఫీలు తాగడం వల్ల కడుపునొప్పి వస్తుంది

ఖాళీ కడుపుతో టీ/కాఫీలు తాగితే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు వస్తాయి

రాత్రి మొత్తం నిద్రపోవడం వల్ల మీ శరీరం డీహైడ్రేటెడ్ గా ఉంటుంది.

లేవగానే టీలు, కాఫీలు తాగేస్తే అవి మీ ఎనర్జీని మరింత దిగజార్చుతాయి.

ఉదయాన్నే గోరు వెచ్చటి నీళ్లు, కావాలంటే కాస్త వేడిగానే తాగచ్చు.

అలా తాగడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఆ తర్వాత మంచి పోషకాలు కలిగిన మంచి బ్రేక్ ఫాస్ట్ చేయండి.

ఆ తర్వాత మీకు తాగాలి అనిపిస్తే టీ లేదా కాఫీ తాగేయండి

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే చెబుతున్న సమాచారం.