చెరకు రసం తాగుతున్నారా?.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

చెరుకు రసంతో దాహం తీరడమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

చెరకు రసంలో అధిక మొత్తంలో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. 

చెరకు రసం తాగితే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

చెరకు రసం యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు.

చెరకు రసం అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.

కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరుకు రసం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.

కిడ్నీలో రాళ్లు కరగడానికి, రాళ్లు విచ్ఛిన్నమై మూత్రంలో వెళ్లిపోవడానికి చెరుకు రసం దోహదం చేస్తుంది.

చెరుకు రసంలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, మెగ్నీషియం, ఇనుము, పొటాషియం, ఫాస్పరస్‌లు ఉన్నాయి.

ఆల్కలైన్ స్వభావం కలిగిన చెరుకు రసం ప్రోస్టేట్, కోలన్, ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది చెరుకు రసం తాగడం వల్ల శరీరపు వేడిని తగ్గించి చల్లబరుస్తుంది.

చెరకు రసం చర్మానికి రాయడం వలన మొటిమలను నయం చేయవచ్చు. ఎందుకంటే చెరకు రసంలో ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్‌లు, గ్లైకోలిక్ యాసిడ్ వంటివి ఉండటం వల్ల కొత్తకణాల నిర్మాణంలో సహాయపడుతుంది. 

చెరకురసం పాలీఫెనాల్స్, అమైనో ఆమ్లాలను కూడా కలిగి ఉంటుంది. వీటిలో కొన్ని యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మంపై ముడతలను నివారించి వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది.

చెరకులో ఉండే పోషకాలు జుట్టును బలంగా, స్ట్రాంగ్ గా చేస్తాయి. షైనీగా స్మూత్ గా ఉండే జుట్టు కావాలనుకునే వారు కూడా తలకు చెరకు రసం రాసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.