బయట ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నారా.. అయితే డేంజర్‌లో పడ్డట్టే..?

Tooltip

అసలే వేసవికాలం భగ భగ మంటూ ఎండలు మండిపోతున్నాయి.

Tooltip

ఇలాంటి సమయంలో ఎండ వేడిని తట్టుకోలేక చాలామంది బయట దొరికే చల్లని ఫ్రూట్ జ్యూస్ ను తాగాలని అనుకుంటారు.

Tooltip

ఎందుకంటే ఆ చల్లని ఫ్రూట్ జ్యూస్ తాగడం వలన ఎండ వేడి నుంచి ఉపపశమనం లభిస్తుందని అభిప్రాయపడతారు.

Tooltip

కానీ, అలా బయట దొరికే ఫ్రూట్ జ్యూస్ తాగడం వలన అనేక ఆరోగ్య సమస్యలతో పాటు.. డేంజర్ లో పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tooltip

ఎందుకంటే.. ఈ జ్యూస్ సెంటర్ల నిర్వాహకులు.. కుళ్లిపోయిన ఫ్రూట్స్, అపరిశుభ్రమైన ఐస్ ఉపయోగించి జ్యూసులు చేస్తుంటారు.

Tooltip

పైగా ఆ ఫ్రూట్స్ పై దుమ్ము, ధూళి  పడుతూ ఉంటాయి. కానీ, వాటిని శుభ్రం చేయకుండానే తయారు చేసి కస్టమర్లకు ఇచ్చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతారు.

Tooltip

ఇలా శుభ్రం లేని, కుళ్లుపోయిన ఫ్రూట్స్‌తో చేసిన జ్యూసులు తాగడం వల్ల ప్రజలు గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి రకరకాల ఇన్ఫెక్షన్‌లకు గురయ్యే అవకాశం ఉంది.

Tooltip

దీని వలన తరుచూ హాస్పిటల్ చూట్టూ తిరుగుతూ.. వేలకు వేలు పోయాల్సి ఉంటుదని  ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Tooltip

అందువల్ల జ్యూస్ సెంటర్లలో జ్యూసులు తాగేటప్పుడు వాళ్లు ఎలాంటి ఫ్రూట్స్ ఉపయోగిస్తున్నారో కాస్త గమనించడం మంచింది.

Tooltip

అలాగే వీలైనంత మేరకు బయట జ్యూసులను పూర్తిగా మానేసి ఇంట్లో చేసుకొని తాజాగా తాగాడం మేలు అని నిపుణులు సూచిస్తున్నారు.

Tooltip

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం