Off-white Banner

రోజూ బీర్‌ తాగుతున్నారా.. అయితే ఈ 5 రోగాలు వచ్చే ఛాన్స్‌

మద్యపానం అనేది మనిషి జీవితంలో సర్వసాధారణం అయ్యింది.

ఆడామగా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు మద్యం సేవిస్తున్నారు.

మన సమాజంలో చాలా మంది రోజు మద్యం తాగుతారు.

మద్యంలో కూడా మిగతా వాటితో పోలిస్తే.. బీర్‌తో ప్రమాదం తక్కువ అని చాలా మంది నమ్మకం.

బీర్‌ మితంగా తాగితే ప్రమాదం లేదు కానీ.. రోజు తాగితే మాత్రం డేంజర్‌ అంటున్నారు వైద్యులు.

రోజు బీర్‌ తాగితే.. బరువు పెరుగతారంట. ఎందుకంటే కొన్ని బీర్లలో కార్బోహైడ్రేట్‌ కంటెంట్‌ ఉంటుంది.

రోజు బీర్‌ తాగితే.. వాటిల్లో ఉండే కార్బోహైడ్రేట్స్‌ వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.

పైగా అదనపు ఆల్కహాల్‌.. ఆకలిని పెంచి బరువు పెరిగేందుకు దారి తీస్తుంది అంటున్నారు.

రోజు బీర్‌ తాగితే కాలేయం దెబ్బ తింటుంది అంటున్నారు.

దీర్ఘకాలిక ఆల్కహాల్‌ తీసుకుంటే.. కాలేయంలో వాపు, కొవ్వు పెరుగుతాయి.

ఫలితంగా సిర్సోసిస్‌ వంటి కాలేయ వ్యాధులకు దారి తీస్తుంది అంటున్నారు.

మితమైన ఆల్కహాల్‌ హార్ట్‌కు మంచిదే అంటారు.

కానీ రోజు బీర్‌ తాగడం వల్ల రక్తపోటు పెరిగి.. ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలను పెంచి.. గుండె జబ్బుల బారిన పడేలా చేస్తుంది అంటున్నారు.

అల్కహాల్‌ మెదడు పని తీరును ప్రభావితం చేస్తుందని మనకు తెలుసు.

అధిక బీర్‌ వినియోగం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతుంది అంటున్నారు.

దీర్ఘకాలిక అల్కహాల్‌ వినియోగం వల్ల చిత్త వైకల్యం, అల్జీమర్స్‌ వ్యాధులు వచ్చే అవకాశం అధికం అంటున్నారు.

ప్రతి రోజు బీర్‌ తాగితే.. అది చివరకు మానసిక, శారీరక వ్యసనంగా మారుతుంది.

కనుక రోజు బీర్‌ తాగే వారు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం