'Tea'ని పదే పదే వేడి చేసి తాగుతున్నారా? ఎంత డేంజరో తెలుసా?

'Tea' ఉదయం నిద్రలేవగానే కాస్త కడుపులో పడితే గానీ కొందరు కుదురుగా ఉండలేరు.

కొంత మందికి Tea తాగకపోతే తలనొప్పి కూడా వస్తుంది.

అలాగే తగినంత 'Tea' తాగితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. Tea మిగిలింది కదా అని పదే పదే వేడి చేసి తాగితే మాత్రం మీ ఆరోగ్యం డేంజర్ లో పడ్డట్లే.

మిగిలిపోయిన Tea ని పదే పదే వేడి చేసి తాగితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Tea ని ఎక్కువగా మరిగించడం వల్ల పోషకాలను కోల్పోతుంది. దాంతో ఆ టీని తాగితే ఎలాంటి ప్రయోజనం ఉండదు.

పదే పదే Tea ని మరిగిస్తే.. శరీరానికి హాని కలిగించే బ్యాక్టీరియా ఏర్పడతాయి.

ఇలా మరిగించిన Tea ని తాగడం వల్ల వికారం, విరేచనాలు, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.

ఇలాంటి Tea తాగడం మూలంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, మరికొన్ని జీర్ణక్రియ సంబంధింత సమస్యలు వస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

 Tea ఎక్కువ సార్లు వేడి చేయడం వల్ల.. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు నశిస్తాయి. 

అందుకే ఆరోగ్య నిపుణులు Tea మిగిలిపోయిందని పదే పదే వేడి చేసి తాగితే.. అనారోగ్యం పాలవుతారని హెచ్చరిస్తున్నారు.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం