మందార పువ్వుతో ఇన్ని ప్రయోజనాలున్నాయా?.. ఆ సమస్యలకు దివ్య ఔషదం
మందార పువ్వులు తెలుపు, పసుపు, కాషాయ రంగులలో ఉంటాయి.
పూజ కోసం, అలంకరణ కోసం మందార పువ్వులను ఉపయోగిస్తుంటారు.
మందార పువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.
మందార పువ్వు ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు దూరం అవుతాయి.
ఈ పువ్వులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని రక్తహీనతను తొలగిస్తుంది.
మందార పువ్వు తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గి బరువు క్రమంగా తగ్గుతారు.
అధిక రక్తపోటు సమస్యను తీర్చడంలో మందార పువ్వులు బాగా పనిచేస్తాయి.
విటమిన్ C సమృద్ధిగా ఉన్న మందార పువ్వులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
చుండ్రు తగ్గడానికి మందార పూల నూనెని వాడొచ్చు.
మందారం పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల రిస్క్ ను తగ్గిస్తుంది.
మందార పువ్వుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం