శీతకాలంలో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టే దివ్య ఔషధం. అదే ఏమిటంటే..

కొన్నిసార్లు వంటింట్లో ఉండే ఆహార పదార్థాలే వంటిల్లు వైద్య శాల అవుతుంది. అందులో ప్రధానమైనది వాము.

వాము ఆహారంలో రుచి, వాసనతో పాటు ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది.

ఈ వాములో సోడియం , ఐరన్ , విటమిన్ ఎ, బి9,  కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

వామును ప్రతిరోజు తీసుకోవడం వలన జీర్ణశక్తి మెరుగుపరచడమే కాకుండా ఆకలిని పెంచుతుంది.

అలాగే వాములో ఉండే  థైమల్ అనే రసాయనం బ్యాక్టీరియా, ఫంగల్ వ్యాధులను నిరోధిస్తుంది.

ఇక తలనొప్పి, అలసట, జలుబు , మైగ్రేన్ వంటి వాటికి వాము దివ్య ఔషధంలా పనిచేస్తుంది. 

కడుపు నొప్పితో బాధపడుతున్న వాళ్లు వామును తీసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

అంతేకాకుండా మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్న వారు ఉదయాన్నే ఖాళీ కడుపులో వాము నీళ్లను తీసుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

జీర్ణక్రియకు సంబంధించిన ఇన్ఫెక్షన్లను నివారించడానికి వాము నీళ్లు ఔషధంలా పనిచేస్తాయి.

రోజు కొంచెం వాము నీళ్లను మరిగించి తాగితే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. 

ఇక వాము నూనెను టూత్ పేస్టేల్లో, మౌత్ వాష్ ల్లో కూడా వాడతారు.