రక్త హీనతతో బాధ పడుతున్నరా.. ఈ నీళ్లను తీసుకుంటే ఆ సమస్యల నుంచి  బయటపడచ్చు.

చాలామందికి శరీరంలో ఎర్ర రక్తకణాలు స్థాయి తగ్గినప్పుడు రక్తహీనతకు గురవుతారు.

దీని కారణంగా నీరసించిపోయి ముఖమంతా పాలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు.

అలాంటప్పుడు ఎండు ద్రాక్ష నీళ్ళు ద్వారా రక్తహీనతను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఒక గిన్నెలో నీళ్ళు,ఎండుద్రాక్షలను తీసుకొని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే రక్తహీనత సమస్యను తగ్గించవచ్చు.

ఇందులో ఇనుము, రాగి బి కాంప్లెక్స్ పుష్కలంగా లభించడంతో పాటు రక్తహీనతను పూర్తిగా నయం చేయడానికి సహాయ పడుతుంది.

అంతేకాకుండా ఈ నీటిలో విటమిన్ ఏ బీటా-కెరోటిన్  అధికంగా ఉండటంతో కంటిచూపు బలపడుతుంది.

ఈ నీటిలో కరిగే ఫైబర్ ఉండటం వల్ల కడుపు ని శుభ్రపరిచి గ్యాస్ తో పాటు ఆమ్లత ను తగ్గిస్తుంది.

అలాగే ఈ ఎండుద్రాక్ష నీటిలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉండటంవల్ల  శరీరానికి శక్తిని అందించి, నీరసం అలసటను కూడా తగ్గిస్తుంది. 

ఎప్పుడైనా అతి విరోచనాలు కలిగినప్పుడు ఎండు ద్రాక్షలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

కేవలం ఎండుద్రాక్ష నీటిని మాత్రమే కాకుండా ఉట్టి ఎండుద్రాక్షను కూడా ప్రతిరోజు తీసుకున్న రక్తహీనత సమస్యను నివారించవచ్చు