సెలబ్రిటీలు తాగే బ్లాక్ వాటర్ తో అన్ని ప్రయోజనాలా? అందుకే అంత డిమాండా?

మానవ శరీరానికి నీరు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

బాడీని డీహైడ్రేషన్ కాకుండా.. అనారోగ్యం పాలుకాకుండా.. నీళ్లు కాపాడతాయి.

అయితే అందరికి సాధారణ నీళ్ల గురించే తెలుసు. కానీ ఎన్నో మినరల్స్ ఉన్న బ్లాక్ వాటర్ గురించి మీకు తెలుసా?

బ్లాక్ వాటర్ ను సెలబ్రిటీలే ఎందుకు ఎక్కువగా తాగుతారు? ఈ నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలు ఏంటి? చూద్దాం.

సాధారణంగా మనం తాగే నీటిలో PH విలువ 7 ఉంటే.. ఈ బ్లాక్ వాటర్ లో అంతకంటే ఎక్కువ ఉంటుందట.

ఇందులో ఉండే 70 శాతం ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా జీర్ణక్రియ రేటును మెరుగుపరుస్తాయి.

ఈ నీటిని తాగడం వల్ల చర్మం పొడిబారకుండా ఉండటంతో పాటుగా జుట్టు రాలడం తగ్గుతుంది.

ఈ నీటిలో ఉండే మినరల్స్ ఏకాగ్రతను పెంచడం, మానసిక స్థితిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి.

వేసవిలో ఈ నీళ్లను ఎక్కువగా తాగితే.. సన్ స్ట్రోక్ నుంచి బయటపడొచ్చు. అలాగే శరీర వేడిని తగ్గిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే.. సెలబ్రిటీలు ఈ బ్లాక్ వాటర్ ను తాగడానికి మెుగ్గుచూపుతూ ఉంటారు.

ప్రముఖులు తాగే వాటర్ కాబట్టి ఈ నీటికి డిమాండ్ కాస్త ఎక్కువే.

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం