శుక్రవారమే వస్తున్న అక్షయ తృతీయ!  ఈ 3 రాశుల వారికి అదృష్టం!

హిందూ సంప్రదాయాల ప్రకారం.. అక్షయ తృతీయ పండుగకు ఎంతో విశిష్టత కలిగి ఉంది.

అయితే ఈ అక్షయ తృతియను ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో తదియ తిథి నాడు జరుపుకుంటారు.

ఇక ఈ అక్షయ తృతియ పండుగ అనేది ఈ ఏడాది మే 10వ తేదీన శ్రుక్రవారం నాడు ఈ పండుగను జరుపకోనున్నారు.

అసలు పురణాల ప్రకారం అక్షయ తృతియ అర్ధం ఏమనగా..  పుణ్యకార్యాల ఫలం అక్షయం చేస్తూ తరిగిపోకుండా చేయమని చేసే వ్రతం అని అర్ధం.

కనుక ఈ పవిత్రమైన రోజున రోజున ఏ పని ప్రారంభించినా కచ్చితంగా విజయం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

అలాగే అక్షయ తృతియ  రోజున చాలామంది  బంగారం, వెండి ఇతర వస్తువులు కొనుగోలు చేస్తారనే విషయం తెలిసిందే.

అయితే హిందు పంచాంగం ప్రకారం ఈ అక్షయ తృతీయ పండుగ రోజున  ఓ 3 రాశుల వారికి  మాత్రం పట్టినందంతా బంగారమేనని జోతిష్య నిపుణులు చెబుతున్నారు.

ఇక ఆ రోజున ధన యోగం, గజకేసరి యోగంతో పాటు సూర్యుడు, శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నందున శుక్రాదిత్య యోగం కూడా ఏర్పడనుంది.

అందుకే ఆరోజున వృశ్చిక రాశి, మేష రాశి, మీన రాశి వారికి పట్టిదంతా బంగారంగా మారబోతుంది.

అలాగే అక్షయ తృతీయ నాడు  ఈ మూడు రాశుల వారికి   రాజయోగంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలగనుంది.