Tooltip

ఒంట్లో వేడిని తరమికొట్టే సూపర్‌ డ్రింక్..దీన్ని తాగితే ఎన్ని లాభాలో తెలుసా..!

పుదినా ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

పుదీనాలో అనేక  ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి శరీర వేడిని తగ్గించి చల్లదనాన్ని ప్రేరేపిస్తాయి. 

వేసవిలో పుదీనా నీటిని ఎక్కువగా తాగడం వల్ల అనేక  ప్రయోజనాలు  ఉన్నాయని  నిపుణులు చెబుతున్నారు.

 పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్ జీర్ణవ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది.

అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి  సమస్యలకు చెక్ పెడుతుంది.

పుదీనా నీరు తాగుతుంటే.. మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటి  ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

పుదీనా నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా రోజంతా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

పుదీనా ఆకులు నీరు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కనుక ఈ నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది.

పుదీనా ఆకుల్లోని మెంథాల్.. వేసవిలో ఎండల తీవ్రతకు వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

నోటి దుర్వాసనతో బాధపడేవారు పుదీనా నీటితో పుక్కిలిస్తే ఆ నోటి దుర్వాసన తగ్గుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం