నాలుగేళ్ల వారంటీతో స్మార్ట్ ఫోన్!

స్మార్ట్ ఫోన్ కంపెనీ అయినా గానీ ఫోన్ల మీద ఏడాది వారంటీ ఇస్తాయి.

అయితే ఇప్పుడు చెప్పుకోబోయే స్మార్ట్ ఫోన్ మాత్రం ఏకంగా నాలుగేళ్ల వారంటీతో వస్తుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా నాలుగేళ్ల వారంటీతో ఒక ఫోన్ ని తీసుకొస్తుంది.

మోటో ఎస్50 నియో పేరుతో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకొస్తుంది.

ఏకంగా ఈ ఫోన్ మీద నాలుగేళ్ల వారంటీ ఇస్తుంది.

ఒక ఏడాది సాధారణ వారంటీతో.. మూడేళ్లు కాంప్లిమెంటరీ వారంటీతో వస్తుంది.

గతంలో షావోమీ, లెనోవో, వన్ ప్లస్ బ్రాండ్లు కొన్ని మోడల్స్ పై రెండేళ్ల వారంటీని ఇచ్చాయి.

అలానే మైజు కంపెనీ.. 20, 21 సిరీస్ లపై ప్రమోషన్ టైంలో మూడేళ్ళ వారంటీ అందించింది.

అయితే ఇప్పుడు వీటి కంటే ఎక్కువ కాలం వారంటీతో మోటోరోలా కొత్త స్మార్ట్ ఫోన్ తీసుకొస్తుంది.  

దీంతో ప్రపంచంలోనే నాలుగేళ్ల వారంటీతో వస్తున్న స్మార్ట్ ఫోన్ గా మోటో ఎస్ 50 నియో ఉంది.