ఈ చిన్న చిట్కాలతో రాత్రుళ్ళు ప్రశాంతమైన నిద్ర మీ సొంతం! ఒక్కసారి ట్రై చేయండి.

ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖమెరుగదు అన్న సామెత మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు.

మనిషి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించేది నిద్ర. అందుకే కంటి నిండా నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు.

కానీ నేటి ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి ఆకలి, నిద్ర కరువైయ్యాయి.

అయితే చిన్న చిట్కాలతో కంటినిండా నిద్ర మీ సొంతం అవుతుంది. అవేంటంటే?

సమయం లేని ఆహారపు అలవాట్ల వల్ల సరిగ్గా నిద్రపట్టదు. అందుకే రాత్రి త్వరగా భోజనం పూర్తి చేయాలి.

రాత్రి నిద్రపోయే గంట ముందే అన్ని రకాల గ్యాడ్జెట్స్ కు దూరంగా ఉండండి. దాంతో మెలటోనిన్ హ్మార్మోన్ విడుదలై హాయిగా నిద్రపడుతుంది.

రాత్రి పడుకునే ముందు ఓ పుస్తకం చదవండి. మీ మనస్సు రిలాక్స్ అయ్యి సుఖంగా నిద్రపడుతుంది.

పసుపు కలిపిన పాలు తాగితే మెదడుకు, ప్రేగులకు మంచిదని, నిద్ర రావడానికి ఇవి ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

పడుకునే ముందు స్నానం చేస్తే.. బాడీ రిఫ్రెష్ అయ్యి.. హాయిగా నిద్రపడుతుందని నిపుణుల అభిప్రాయం.

రాత్రి నిద్రపోయేముందు ప్రాణాయామం చేస్తే.. మనస్సు ప్రశాంతగా ఉండి.. నిద్ర బాగా పడుతుంది. ఈ చిట్కాలను మీరూ ఓసారి ట్రై చేయండి.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం