మార్కెట్ లో కొత్త తరహా మోసం! రాత్రికి రాత్రే అంతా మార్చేస్తున్నారు!

ప్రస్తుతం దేశంలో సైబర్ నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.

కేటుగాళ్లు ఈజీ మనీకి అలవాటుపడి రోజుకొక కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

చివరికి అన్ లైన్ ట్రాన్నాక్షన్స్ స్కామర్లను కూడా విడిచిపెట్టడంలేదు.

ముఖ్యంగా చిరు వ్యాపారస్తులనే టార్గెట్ చేస్తు వారి పొట్టకొడుతూ భారీ మోసానికి పాల్పడుతున్నారు.

చిరు వ్యాపారస్తులు తోపుడు బండ్లపై క్యూఆర్ కోడ్ స్కానర్లను అమర్చి ఉంటారు

అయితే కొందరు కేటుగాళ్లు, రాత్రి సమయంలో చిరు వ్యాపారులు బండ్లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కానర్లను గమనించి స్థానంలో వేరే స్కానర్ల స్టికర్లను ను అమర్చుతున్నారు.

విధంగా వ్యాపారులకు వచ్చే మొత్తం సోమ్మును తమకు వచ్చేలా చేసుకుంటున్నారు.

దీంతో వినియోగదారులు   చిరు వ్యాపారులకు చెల్లిస్తున్న  డబ్బులు వారి కాకుండా నేరగాళ్ల అకౌంట్ కు చేరుతున్నాయి.

కనుక మీలీ ఎవరైనా వ్యాపారం చేస్తూ క్యూఆర్ కోడ్ ను పెట్టుకున్నట్లు అయితే ఒకసారి దానిని చెక్ చేసుకోవడం మంచిది.

క్యూఆర్ కోడ్ స్కానర్ కు  సౌండ్ బాక్స్ సిస్టమ్ ను ఉపాయోగించడం వలన ఈ తరహా మోసాల నుంచి తప్పించుకోవచ్చు.