వాట్సాప్‌లో కొత్త ఫీచర్..  మెసేజ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే!

వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్, అప్డేట్స్ తో యూజర్స్ ని ఆకట్టుకుంటుంది.

తాజాగా మరొక అప్డేట్ ని తీసుకొచ్చింది. మీడియా రియాక్షన్ షార్ట్ కట్ ని పరిచయం చేసింది.

చాట్ లో కనిపించే ఫోటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజెస్ వంటి మెసేజులకి క్విక్ రియాక్షన్ ఇవ్వడం కోసం రియాక్షన్ షార్ట్ కట్ ని తీసుకొచ్చింది.

ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మీద, చాట్ మెసేజుల మీద డబుల్ ట్యాప్ చేస్తే లవ్ సింబల్ వస్తుంది కదా.

అలా వాట్సాప్ లో కూడా మెసేజుల మీద రెండు సార్లు ట్యాప్ చేస్తే హార్ట్ ఎమోజీ వస్తుంది.

వాట్సాప్ లో ఎవరైనా పంపించిన మెసేజులకి, ఫోటోలకి, వీడియోలకి హార్ట్ ఎమోజీతో క్విక్ రియాక్షన్ ఇవ్వచ్చు.

డబుల్ ట్యాప్ రియాక్షన్ ని వాట్సాప్ డెవలప్ చేసిందని వాట్సాప్ బీటా ఇన్ఫో డాట్ కామ్ వెబ్ సైట్ తెలిపింది.

ఇప్పటి వరకూ ఎమోజీల ద్వారా ఎమోషన్స్ ని మెసేజెస్ కి క్విక్ రియాక్షన్ ఇచ్చాము.

ఇక నుంచి డబుల్ ట్యాప్ చేయడం ద్వారా మరింత క్విక్ రియాక్షన్ ఇవ్వచ్చునన్న మాట.

బీటా యూజర్స్ కోసం ఆండ్రాయిడ్ 2.24.16.7 అప్డేట్ లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది.

ప్రస్తుతం టెస్టింగ్ దశలో  ఉంది. త్వరలో అందరికీ   అందుబాటులోకి  తీసుకురానున్నారు.