క్యాన్సర్‌ భూతాన్ని తరిమే అద్భుత ఫలం.. కనిపిస్తే అస్సలు వదలకండి

నేటి కాలంలో మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారుల్లో క్యాన్సర్‌ ఒకటి.

ఇప్పటికి కూడా దీనికి పూర్తి స్థాయిలో సరైన చికిత్స లేదు.

లేజర్‌ ట్రీట్మెంట్‌ వంటివి అందుబాటులో ఉన్నాయి.

కానీ ఆ చికిత్స తర్వత మనిషి ఎంత బలహీనం అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అయితే క్యాన్సర్‌ బారిన పడ్డాక.. ఇబ్బంది పడటం కంటే.. రాకుండా జాగ్రత్త పడటం మంచిది.

ఈ క్రమంలో కొన్ని ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

క్యాన్సర్‌ బారిన పడకుండా కాపాడే ఆహారాల్లో.. ఆప్రికాట్‌ ఒకటి.

దీనిలో యాంటీఆస్సిడెంట్లు పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.

ఆప్రికాట్‌ను సూపర్‌ ఫుడ్‌ అంటారు. దీనిలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.

దీనిలో  బీటా కెరోటిన్, లుటిన్, పొటాషియం, విటమిన్ A,C, E, జియాక్సంతిన్ అధికంగా ఉంటాయి.

అందుకే ఆప్రికాట్‌ కళ్లకు కూడా చాలా మేలు చేస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆప్రికాట్‌ పండ్లు కంటిశుక్లం, రేచీకటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఇక ఆప్రికాట్‌లో ఉన్న బీటా-కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్, విటమిన్ A, C, E, వంటి యాంటీఆక్సిడెంట్‌ పదార్థాలు..

యాంటీ-క్యాన్సర్ ఏజెంట్లుగా పని చేసి ఫ్రీ రాడికల్స్ నుండి శరీరంలోని కణాలను రక్షిస్తాయి.

కనుక తరచుగా ఆప్రికాట్‌లను తింటే.. క్యాన్సర్‌ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం