బైకు సైజులో 2 లక్షలకే కారు..  ఇదే కదా కావాల్సింది

2 లక్షలకి కారు రావడం అంటే అదసలు సాధ్యమయ్యే పనేనా?

మంచి స్టైలిష్ బండి కొనాలంటేనే 2 లక్షలు అవుతుంది. అలాంటిది బైక్ ధరకే కారు వస్తుందంటే ఆశ్చర్యమే.

అది కూడా బైక్ సైజులో వస్తుండడం, అందులోనూ ఎలక్ట్రిక్ కారు అవ్వడం విశేషం.

పెట్రోల్ కార్లు కొనాలంటే అసలు ఆ ఆలోచనే రాదు. పోనీ ఎలక్ట్రిక్ కారు కొందామంటే 10 లక్షలు పైనే ఉంది.

బైకు ధరకే, బైక్ లాంటిది చిన్న ఫ్యామిలీ కోసం తీసుకొస్తే సరిపోదా? అనుకునేవారి కోసమే ఈ కారు.

వర్షాలు పడుతున్నప్పుడు, రోడ్లు మునిగినప్పుడు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు సామాన్యులు ఎంత నలిగిపోతారో తెలిసిందే.

అలాంటి సామాన్యుల కష్టాలు తీర్చే కారే ఈ వింగ్స్ ఈవీ రాబిన్ కారు.

వింగ్స్ ఈవీ అనే కంపెనీ మిడిల్ క్లాస్ వారి కోసం 2 లక్షల బడ్జెట్ లో రాబిన్ అనే ఎలక్ట్రిక్ కారుని తీసుకొచ్చింది.

ఇది బైక్ సైజులో ఉండడం వల్ల పార్కింగ్ కి కూడా ఇబ్బంది ఉండదు.

ఇద్దరు సౌకర్యంగా కూర్చునే విధంగా రెండు సీట్లను ఇచ్చారు. చిన్న పిల్లలు ఉంటే ముగ్గురికి సరిపోతుంది.