Tooltip

కిడ్నీ సమస్యలకు వరం.. కొండ పిండి ఆకు

ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే మొక్కలలో తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రస్తుతం అన్ని కలుషితం అవుతున్న కారణంగా.. అందరు ఎన్నో అనారోగ్య సమస్యలకు గురి అవుతున్నారు

 అందుకే అనారోగ్య సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టెలా ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి.

 అటువంటి మొక్కలలో ఒకటి కొండ పిండి ఆకు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 కొండ పిండి ఆకు ఎక్కువగా నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పెరుగుతుంది.

 తమిళనాడు ప్రాంతాలలో పండుగల సమయంలో దీనిని అలంకరణగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

 అయితే ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వలన.. జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి.

ముఖ్యంగా ఈ ఆకులలో కిడ్నీలో రాళ్లను సైతం కరిగించే శక్తులు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 ఆల్కలాయిడ్‌లు ఎర్విన్, ఎర్వోసైడ్, ఏర్వైన్, మిథైలార్విన్, ఏర్వోసైడ్, ఎర్వోలనిన్ లాంటివి ఎన్నో ఈ ఆకులలో లభిస్తాయి.

ఉదయం పూట పరిగడుపున కొంత కొండపిండి ఆకు  రసాన్ని తాగడం వలన కిడ్నీ సమస్యలు దూరం అవుతాయి.

అలాగే నులిపురుగు నివారణకు కూడా ఇది అద్భుతమైన మందు అని.. నిపుణులు చెబుతున్నారు.

 దీనిని న్యుమోనియా, టైఫాయిడ్ మరియు కామెర్లు వంటి జ్వరాలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

 కాబట్టి ఈ కొండపిండి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు  చెబుతున్నారు.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం