కడుపు ఉబ్బరంగా ఉండడానికి 8 కారణాలు.. ఇలా తగ్గించుకోండి

కడుపు ఉబ్బరం సమస్య చాలా మందిని వెంటాడుతుంది. దీని వల్ల అసౌకర్యంగా, చిరాకుగా ఉంటుంది.  

అతిగా తినడం: అతిగా తినడం వల్ల జీర్ణమవ్వడం కష్టమై గ్యాస్ ఫామ్ అవుతుంది. రోజు మొత్తంలో ఎక్కువ సార్లు తక్కువ తింటూ ఉంటే ఈ సమస్య దూరమవుతుంది.   

వేగంగా తినడం: వేగంగా తినడం వల్ల ఫుడ్ తో పాటు గాలి కూడా కడుపులోకి వెళ్తుంది. దీని వల్ల ఉబ్బరం సమస్య వస్తుంది. అందుకే కొంచెం నెమ్మదిగా తినాలి. 

అధిక ఫైబర్ డైట్: జీర్ణక్రియకు ఫైబర్ అవసరమని చెప్పి ఉన్నట్టుండి బీన్స్, పప్పు, పలు కూరగాయలు వంటి ఫైబర్ ఫుడ్స్ అతిగా తింటే గ్యాస్ ఎక్కువై ఉబ్బరం సమస్య వస్తుంది.

లాక్టోజ్, గ్లూటెన్ ఫుడ్స్: లాక్టోజ్, గ్లూటెన్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల ఉబ్బరం సమస్య, ఇతర జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. ఇలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి.  

మలబద్ధకం: పేగుల్లో మలం పెరిగితే ఉబ్బరం సమస్య వస్తుంది. ఫైబర్ లోపం, తగినంత హైడ్రేషన్ లేకపోవడం, ఒకే చోట కదలకుండా కూర్చుని పని చేయడం వంటివి మలబద్ధకానికి దారితీస్తాయి.   

కార్బోనేటెడ్ డ్రింక్స్: శీతల పానీయాల్లో ఉండే కార్బన్ డయాక్సయిడ్ వల్ల గ్యాస్ ఎక్కువై ఉబ్బరం సమస్యకు దారి తీస్తుంది. హెర్బల్ టీ, నీరు, పండ్ల రసాలు వంటివి సమస్యను తగ్గిస్తాయి.      

హార్మోన్ల హెచ్చుతగ్గులు: రుతుస్రావం సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల మహిళల్లో ఉబ్బరం సమస్య ఉంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ స్థాయిలు ద్రవం నిలుపుదలని ప్రభావితం చేస్తాయి.     

దీర్ఘకాలిక ఒత్తిడి: దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. దీని వల్ల జీర్ణక్రియ నెమ్మదించి ఉబ్బరం సమస్య వస్తుంది.    

త్వరగా తినడం, అనారోగ్యకరమైన ఆహారం తినడం వంటి ఒత్తిడి సంబంధిత అలవాట్లు సమస్యను తీవ్రం చేస్తాయి.   

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం