Tooltip

పెళ్లి చేసుకునే ముందు అమ్మాయిలు భాగస్వామిని అడగాల్సిన 7 ప్రశ్నలు!

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే వారు ఖచ్చితంగా మీ భాగస్వామిని ఈ 7 ప్రశ్నలు అడగండి.

ఆ ప్రశ్నలను బట్టి మీ లైఫ్ లోకి వచ్చే వ్యక్తి మీకు రైట్ పర్సనా? కాదా? అనేది తెలిసిపోతుంది.

వైవాహిక జీవితం బాగుండాలంటే ఒకరి విలువలు మరొకరు, ఒకరి నమ్మకాలను మరొకరు అర్థం చేసుకోవాలి.

మతం, కుటుంబం, కల్చరల్ ట్రెడిషన్స్ వంటి వాటి మీద చర్చించుకుంటే ఎవరేంటి అనేది తెలుస్తుంది.

లక్ష్యం, ఆశయాలు వంటి వాటి గురించి అడిగి తెలుసుకోండి. ఈ రెండు విషయాల్లో మీ లైఫ్ లోకి వచ్చే వ్యక్తి ఎలాంటి వాడో అనేది తెలుస్తుంది.

పెళ్లయ్యాక ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు, విబేధాలు వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారో అడిగి తెలుసుకోండి.

పెళ్లి జీవితం మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో కాబోయే భాగస్వామిని అడగండి.

భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో అడిగి తెలుసుకోండి. దీని వల్ల భాగస్వామి యొక్క స్ట్రెంత్ అనేది తెలుస్తుంది.

పెళ్లయ్యాక వెంటనే పిల్లలు వద్దనుకున్నట్లైతే కనుక చేసుకోబోయే వ్యక్తికి అర్ధమయ్యేలా చెప్పండి. ఒకవేళ పిల్లలంటే ఇష్టం అనుకుంటే కనుక పెళ్లయిన వెంటనే కావాలని చెప్పండి.

ఆర్థికంగా బాగా స్థిరపడ్డాక పిల్లలని కనాలని అనుకుంటారు. అయితే ఈ విషయంలో మగాళ్లు రెండు రకాలుగా ఆలోచిస్తారు.

పెళ్లయ్యాక వెంటనే పిల్లల్ని కనాలనుకోవడం.. కొన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత పిల్లలు ఉంటే బాగుంటుంది అనుకోవడం. మీ ఛాయిస్ ఏది అనే దాన్ని బట్టి మీ జీవిత భాగస్వామిని ఎంచుకోండి.

ప్రేమ, కమిట్మెంట్ పై అతని అభిప్రాయం ఏంటో తెలుసుకోండి. ఎమోషనల్ అవసరాలు ఉంటాయి. వాటి పట్ల భాగస్వామి ఎంత బాధ్యతగా ఉంటారో అనే విషయాన్ని అడగండి.

ప్రేమ, కమిట్మెంట్ మీద ఇద్దరి వ్యూస్ పెళ్లయ్యాక మీ వైవాహిక జీవితాన్ని చివరి వరకూ స్ట్రాంగ్ గా ఉంచుతాయి.