13 వేలకే 5G స్మార్ట్ ఫోన్..

టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతుంది. దానికి తగ్గట్టు జనాలు కూడా అప్ గ్రేడ్ అవుతున్నారు.

ఒకప్పుడు 4జీ హవా నడిచింది. ఇప్పుడు 5జీ హవా నడుస్తోంది.

ఈ క్రమంలో 5జీ స్మార్ట్ ఫోన్లకి డిమాండ్ పెరిగింది. కంపెనీలు కూడా 5జీ స్మార్ట్ ఫోన్లని తయారు చేస్తున్నాయి.

రీసెంట్ గా ఐకూ కంపెనీ జడ్9ఎక్స్ మోడల్ 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేసింది.   

ఇది 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకూ బ్యాటరీ పని చేసేలా దీన్ని రూపొందించారు.

దీని అసలు ధర 18 వేలు అయితే 5 వేలు తగ్గింపుతో 13 వేలకే విక్రయిస్తోంది.

6.72 అంగుళాల డిస్ప్లేతో వస్తున్న ఈ ఫోన్ లో 50 ఎంపీ ఏఐ కెమెరా, ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ టెక్నాలజీ ఫీచర్స్ ఉన్నాయి.

ఇది 3 మోడల్స్ లో వస్తుంది. 4 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది. స్టోరేజ్ ని 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు.

4 జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ ధర రూ.12,999 రూపాయలు కాగా.. 6 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ. 15,999 పడుతుంది.