విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లు రద్దు.. ఎప్పటి వరకంటే!

ఈమధ్యకాలంలో రైళ్లలో ప్రయాణానికి రెడీ అవుతున్నారా..

రైల్వే శాఖ ప్రయాణికులకు కీలక అలర్ట్‌ జారీ చేసింది.

సుమారు 25 రైళ్లను రద్దు చేశారు. అది కూడా సుమారు రెండు నెలల పాటు.

ఏపీలోని విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. 

మరి ఇంత భారీ సంఖ్యలో రైళ్ల రద్దుకు కారణం ఏంటి అంటే..

విజయవాడ రైల్వే డివిజన్‌లో ట్రాక్‌ నిర్వహణ పనులు సాగుతున్నాయి. 

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను, వసతులను కల్పించేందుకు అధికారులు పనులు చేపట్టారు..

దీంతో పలు రూట్లలో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు.

ముఖ్యంగా విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లను రద్దు చేశారు. 

జూన్‌ 21 నుంచి ఆగస్టు 15 వరకు రైళ్లు రద్దు చేస్తున్నామని రైల్వే అధికారులు వెల్లడించారు. 

ఇప్పటికే ఈనెల 24-28 వరకు విజయవాడ మీదుగా వెళ్లే 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 

11 రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు. ట్రాక్‌ నిర్వహణ వల్ల రైళ్లను రామవరప్పాడు స్టేషన్‌ వరకు నడుపుతున్నట్లు ప్రకటించారు. 

ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచించారు.