లవర్‌తో అస్సలు అనకూడని 10 మాటలు!

మీ నుంచి నువ్వు ఎప్పుడూ ఇంతే, నాకు కుదరదు.. ఈ రెండు మాటలు వింటే మీ మీ పార్టనర్ కి తన మాటంటే లెక్క లేదన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోతారు.

మీ పార్టనర్ తన బాధలను మీతో పంచుకున్నా, ఏదైనా షేర్ చేసుకుంటున్నా అదంత పెద్ద సమస్యే కాదు అని అనకండి. బాధపడతారు.

ఏదైనా తప్పు గానీ పొరపాటు గానీ చేసినప్పుడు నీకు ముందే చెప్పాను కదా అని పాయింట్ అవుట్ చేయకండి. ఈగో హర్ట్ అయి మీకు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది.

నువ్వు కూడా వాళ్ళలానే అని అస్సలు అనకండి. మరెవరితోనూ పోల్చకండి. అలా పోలిస్తే దూరమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.

నువ్వు మరీ సాఫ్ట్ గా ఉన్నావ్ అని అనకండి. ఎక్కడ లేని కోపం పొడుచుకొచ్చేస్తుంది.

ఇతరులతో పోల్చి నువ్వు అలా ఎందుకు చేయడం లేదు అని తక్కువ చేయకండి. వాళ్ళు అలా ఉన్నారు, నువ్వేంటి ఇలా ఉంటావ్ అని పోలిస్తే హర్ట్ అవుతారు.

చిన్న సమస్య అయినా గానీ పార్టనర్స్ తో పంచుకోండి. లోపల బాధను దాచుకుని నేను బానే ఉన్నాను అని చెబితే లవర్ దూరమయ్యే ఛాన్స్ ఉంది.

ఓవర్ యాక్టింగ్ చేయకు.. ఈ మాట అస్సలు వాడకూడదు. సున్నితమైన పర్సన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

దాని గురించి మాట్లాడదలచుకోలేదు అని అనకండి. ఏదో దాస్తున్నారన్న ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల లవర్ దూరమయ్యే ఛాన్స్ ఉంది.

ఇక నిన్ను నేను ప్రేమించను అని ఈ మాట ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. అంటే లవర్ మీద ఆశలు వదిలేసుకునే పరిస్థితి వస్తుంది.