iDreamPost

కరోనాకు మందు కనుగొన్నాం – బాబా రామ్‌దేవ్

కరోనాకు మందు కనుగొన్నాం – బాబా రామ్‌దేవ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కానీ ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. కాగా కరోనాకి విరుగుడు మందు తన దగ్గర ఉందని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే పతంజలి సంస్థ వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ కరోనా వైరస్‌కు మందు తన దగ్గర ఉందని ప్రకటించారు. గిలోయ్ మరియు అశ్వగంధతో కరోనా వైరస్ కి చికిత్స చేయవచ్చునని వెల్లడించారు.రామ్‌దేవ్ బాబా చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశం అయింది. శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్ ఇతర కణాలకు సోకే సమయంలో వైరస్ చైన్ ని ఏర్పాటు చేస్తుందని కాగా అశ్వగంధ మరియు గిలోయ్ ఆ సంక్రమణ గొలుసును విచ్ఛిన్నం చేయడం ద్వారా శరీరంలో వైరస్ వ్యాప్తిని నివారిస్తుందని బాబా రామ్‌దేవ్ తెలిపారు.

ఇప్పటికే కరోనా వైరస్ సోకిన రోగులకు గిలోయ్, అశ్వగంధ, తులశివతి ఖాళీ కడుపుతోనూ తినడం తరువాత ఇచ్చామని 100 శాతం రికవరీ రేటును ఈ విధానంలో సాధించామని రామ్‌దేవ్ బాబా ప్రకటనలో వెల్లడించారు. కాగా ఈ విధానంపై క్లినికల్ కంట్రోల్ ట్రయల్ జరుగుతుందని పేర్కొన్నారు. 100 శాతం రికవరీ రేటు మరియు 0 శాతం మరణ రేటు ఈ అశ్వగంధ, గిలోయ్ చికిత్స విధానంలో ఉందని యోగా గురు వెల్లడించారు.

ఒకవేళ ఈ చికిత్స విధానం కనుక విజయవంతం అయితే కరోనా వ్యాధిని అదుపు చేయొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా జపాన్‌లోని AIST సహకారంతో ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తల బృందం, అశ్వగంధకు కరోనా వైరస్ తో పోరాటం చేయగల సామర్థ్యం ఉందని కనుగొనడం విశేషం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి