ప్రభాస్ ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్.. హను రాఘవపూడి మూవీలో..!

ప్రభాస్ ఫ్యాన్స్‌కి క్రేజీ న్యూస్.. హను రాఘవపూడి మూవీలో..!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికీ కల్కి కంప్లీట్ చేశాడు. రాజా సాబ్ షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వర్మ చిత్రాలున్నాయి. ఇదే కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు.

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికీ కల్కి కంప్లీట్ చేశాడు. రాజా సాబ్ షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ వర్మ చిత్రాలున్నాయి. ఇదే కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు.

యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ వరుస పెట్టి బడా ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే కంప్లీట్ చేసిన.. కల్కి 2898 AD ఈ నెల 27న విడుదల కాబోతుంది. నాగ్ అశ్విన్ దర్శకుడు. ఈ మూవీపై బజ్‌తో పాటు విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సైతం బాక్సాఫీసు లెక్కల కోసం ఎదురు చూస్తుంది. వైజయంతీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అశ్వనీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొనే, దిశా పటానీతో పాటు రాజేంద్ర ప్రసాద్, పశుపతి, మలయాళ ముద్దుగుమ్మ అన్నాబెన్ కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, నాని, దుల్కర్ వంటి స్టార్ హీరోస్ కూడా గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో చేపట్టనున్నారు.  ఇదిలా ఉంటే.. ఈ మూవీ చేస్తుండగానే.. కన్నప్పలో గెస్ట్ రోల్ చేశాడు ప్రభాస్. దీనితో పాటు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చేస్తుండగా.. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా సలార్ సీక్వెల్ కూడా ఈ ఏడాదిలో పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సలార్ 2 ఈ ఏడాది చివరిలో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కాకుండా డేరింగ్  అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ కూడా చేయబోతున్నాడు.

అలాగే సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడితో మరో మూవీని ఓకే చేసినట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ సెట్ అయ్యారని సమాచారం. హను రాఘవపూడి  అచ్చొచ్చిన మ్యూజిక్  డైరెక్టర్ విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనున్నారని తెలుస్తోంది. అంతకు ముందు పడి పడి లేచే మనసు ,సీతా రామం చిత్రాలకు అతడే సంగీతాన్ని అందించాడు. పాటల పరంగా ఈ రెండు సినిమాల ఆల్బమ్స్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమాకు కూడా బాణీలు సమకూర్చే పని విశాల్ కే అప్పగించనున్నాడు హను రాఘవపూడి. ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. యాక్టర్స్, టెక్నీషియన్లు తీసుకునే ఉందని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కేయనున్నట్లు సమాచారం.

Show comments