వాళ్లిద్దరు మోస్ట్ ఫన్నీయెస్ట్ పర్సన్స్.. కానీ! స్వప్నిల్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వాళ్లిద్దరు మోస్ట్ ఫన్నీయెస్ట్ పర్సన్స్.. కానీ! స్వప్నిల్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

వాళ్లిద్దరు మోస్ట్ ఫన్నీయెస్ట్ ప్లేయర్లు అని.. ఇద్దరు స్టార్ క్రికెటర్ల పేర్లను చెప్పుకొచ్చాడు యంగ్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్. మరి అంత సరదాగా ఉండే ఆ ఆటగాళ్లు ఎవరు? తెలుసుకుందాం పదండి.

వాళ్లిద్దరు మోస్ట్ ఫన్నీయెస్ట్ ప్లేయర్లు అని.. ఇద్దరు స్టార్ క్రికెటర్ల పేర్లను చెప్పుకొచ్చాడు యంగ్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్. మరి అంత సరదాగా ఉండే ఆ ఆటగాళ్లు ఎవరు? తెలుసుకుందాం పదండి.

సాధారణంగా క్రికెట్ కు సంబంధించి ఆటగాళ్లు బయట ఎలా ఉన్నా.. గ్రౌండ్ లోకి దిగితే మాత్రం ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనాల్సిందే. మైదానంలో ఎంత దూకుడుగా ఉంటే.. ప్రత్యర్థులు అంత భయపడతారు. అయితే కొంత మంది ప్లేయర్లు దూకుడు తనంతో పాటుగా సరదాగా కూడా ఉంటారు. అలా ఆర్సీబీలో మోస్ట్ ఫన్నీయెస్ట్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారని చెప్పుకొచ్చాడు ఆర్సీబీ ప్లేయర్ స్వప్నిల్ సింగ్. మరి అంత సరదాగా ఉంటే ఆ ఇద్దరు ఎవరు? తెలుసుకుందాం పదండి.

స్వప్నిల్ సింగ్.. ఐపీఎల్ 2024 సీజన్ లో హాట్ టాపిక్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించిన ఆటగాడు. వరుస పరాజయాలతో టోర్నీ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించే స్థాయి నుంచి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరిందంటే.. దానికి కారణం స్వప్నిల్ సింగ్. అతడి రాకతో ఆర్సీబీ దశ మారిపోయిందని స్వయంగా కెప్టెన్ డుప్లెసిస్ చెప్పడం విశేషం. ఈ సీజన్ లో 7 మ్యాచ్ ల్లో 6 వికెట్లు తీశాడు. తీసింది తక్కువ వికెట్లే అయినా.. తన ప్రభావం మాత్రం ఘనంగా చాటుకున్నాడు. ఇక తనకు టీమ్మెట్స్ తో ఉన్న అనుబంధాన్ని తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే ఆర్సీబీ టీమ్ లో వాళ్లిద్దరు మోస్ట్ ఫన్నీయెస్ట్ పర్సన్స్ అంటూ టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్ వెల్ పేర్లను చెప్పుకొచ్చాడు. కోహ్లీ, మాక్సీ ఎంతో సరదాగా ఉంటారని తెలిపాడు స్వప్నిల్ సింగ్. సహచర ఆటగాళ్లను ఆటపట్టించడంలో విరాట్ ముందుంటాడని, అయితే ఎంత సరదాగా ఉంటాడో.. తనను కవ్విస్తే అదే రేంజ్ లో విరుచుకుపడతాడు అంటూ వివరించాడు. కోహ్లీ ఓ దిగ్గజం అని.. అతడిని మూడు ఫార్మాట్స్ లో చేరుకోవడం ఎవరి వల్లా కాదని ప్రశంసించాడు. ఆర్సీబీ టీమ్ లో విరాట్, మాక్సీతో చేసిన ప్రయాణం తన జీవితాంతం గుర్తు ఉంటుందని ఈ పాడ్ కాస్ట్ లో వివరించాడు. ప్రస్తుతం స్వప్నిల్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments