70 ఏళ్ల వృద్దుడితో 28 ఏళ్ల యువతి పెళ్లి.. తాత.. మనవరాలు అంటూ కామెంట్స్

70 ఏళ్ల వృద్దుడితో 28 ఏళ్ల యువతి పెళ్లి.. తాత.. మనవరాలు అంటూ కామెంట్స్

Viral Wedding.. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతుంటాయని పెద్దలు అంటారు కానీ.. ఈ రోజుల్లో జరుగుతున్న వివాహాలు ఇక్కడే నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తుంది. అందుకు ఉదాహరణ ఈ తరహా పెళ్లిళ్లు.

Viral Wedding.. పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతుంటాయని పెద్దలు అంటారు కానీ.. ఈ రోజుల్లో జరుగుతున్న వివాహాలు ఇక్కడే నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తుంది. అందుకు ఉదాహరణ ఈ తరహా పెళ్లిళ్లు.

పెళ్లి అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి చేసే అపురూపమైన ఘట్టం. పెళ్లి తంతులో ముఖ్యమైనది.. అమ్మాయి..అబ్బాయి ఈడు జోడు కుదిరిందా అని. ఆ తర్వాత జాతకాలు కలిశాయా అని చూస్తుంటారు. వీటిల్లో ఎక్కడ తేడా కొట్టినా..ఆ పెళ్లి పీటలు వరకు ఎక్కడం కష్టం. ఈ రోజుల్లో సగం పెళ్లిళ్లు ఈ జాతకాలు, మూడ నమ్మకాల చుట్టూ తిరుగుతున్నాయి. దీంతో మగవాళ్లకు పెళ్లిళ్లు కావడం కష్టంగా మారింది. కాస్తో కూస్తో సంపాదన పరులే కాదు.. లక్షలు సంపాదిస్తున్న అబ్బాయిలకు కూడా ఇవి అవరోధంగా మారాయి అనొచ్చు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.పెళ్లి కాని యువకుల కన్నా మధ్యవయస్కులు, ముసలి వాళ్లకు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. దీంతో ‘మాకు పెళ్లెప్పుడవుతుంది బాబోయ్.. మాకు పిల్ల ఏడ దొరకుతుంది’ బాబోయ్ అనుకుంటున్నారు కుర్రకారు.

ఇదిగో ఇప్పుడు అలాంటి పెళ్లి నెట్టింట్లో చర్చకు దారి తీసింది. తాత వయస్సున్న వ్యక్తి మనవరాలు వయస్సున అమ్మాయిని మనువాడాడు. వయస్సు ఏజ్ 70 ఏళ్లు కాగా, వధువు వయస్సు 28 ఏళ్లు అని తెలుస్తోంది. తాత వయసులో ఉన్న ఒక వ్యక్తి క్రీమ్ కలర్ షేర్వానీ, ఎరుపు రంగు దుపట్టాలో ఆమె పక్కన కనిపిస్తున్నాడు. ఈ పెళ్లి ఇటలీలో జరిగినట్లు తెలుస్తుంది. ఇద్దరి మధ్య వయస్సు బేధం సుమారు 40 ఏళ్ల తేడా ఉంది. కాగా, ఇందులో పెళ్లి కూతురు చిరునవ్వులు చిందిస్తూ కనిపించడం విశేషం. ఇద్దరు కలిసి రొమాంటిక్ పాటకు డ్యాన్స్ చేసినట్లు వీడియోలో కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియా నుండి డిలీట్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.

అయితే నెటిజన్లు.. వీరిద్దరూ భార్యా భర్తలు అంటే నమ్మకశ్యంగా లేదని అంటున్నారు. కాగా,యువతితో పెళ్లి అనగానే.. ముసలోడికి దసరా పండుగ అనుకుంటా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది తాత, మనవరాలు డ్యాన్స్ చేస్తున్నారని అనుకుంటున్నారు. అయితే వీరిద్దరూ భార్య భర్తలు అంటేకొంత మంది తీసుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో వరుసగా ఈ తరహా పెళ్లిళ్లు చోటుచేసుకుంటున్నాయి. ఏదో కాస్తో, కూస్తో వయస్సు తేడా అయితే పర్వాలేదు కానీ.. మరీ 30 నుండి 50 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఏంటనీ, ఈ పోకడ ఎటుపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఇక కుర్రకారు అయితే.. తమకు పెళ్లి కూతురు దొరకట్లేదన్న ఆందోళన కన్నా.. ముసలొళ్లకీ అమ్మాయిలు పడిపోతున్నారే అన్నచింత పెరిగిపోయింది.

Show comments