మంటగలిసిన మానవత్వం.. అంబులెన్స్ డ్రైవర్ పై దాడి! అతి కిరాతకంగా!

మంటగలిసిన మానవత్వం.. అంబులెన్స్ డ్రైవర్ పై దాడి! అతి కిరాతకంగా!

ప్రాణాలు కాపాడే వాహనం అంబులెన్స్. రోడ్డుపై రయ్ రయ్ అంటూ దూసుకెళుతూ ఉంటుంది. రోడ్డుపై ఎన్ని వాహనాలు ఉన్నా.. ఈ అంబులెన్స్ కనిపించగానే.. పక్కకు తప్పుకుంటారు. కానీ మానవత్వం మంటగలిసేలా ఓ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

ప్రాణాలు కాపాడే వాహనం అంబులెన్స్. రోడ్డుపై రయ్ రయ్ అంటూ దూసుకెళుతూ ఉంటుంది. రోడ్డుపై ఎన్ని వాహనాలు ఉన్నా.. ఈ అంబులెన్స్ కనిపించగానే.. పక్కకు తప్పుకుంటారు. కానీ మానవత్వం మంటగలిసేలా ఓ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.

మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు అని ఓ గేయ రచయిత అన్నట్లుగా.. ప్రస్తుత పరిస్థితులకు ఈ పదాలకు అద్దం పడుతున్నాయి. సాటి మనిషి ఆపదలో ఉంటే సాయం చేయాలన్న గుణం పోయింది. బదులుగా స్వార్థంతో కన్నుమిన్ను కానరావడం లేదు. నాకేంటీ లాభం అనే ప్రశ్నలు వేసుకుని.. నిత్యం స్వార్థపూరితమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇంటా, బయటా ఇదే పరిస్థితి. ఎవరైనా రోడ్డు మీద పడిపోయి ఉంటే.. తాగి పడిపోయారు అనుకుంటున్నారు కానీ.. అనారోగ్య సమస్యలతోనే, మరో ఇతర కారణాలతో పడిపోయి ఉంటాడు అన్న ఆలోచన చేయడం లేడు. అలా చూసి పక్క నుండి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు మరో ఘటన చూస్తే.. నిజంగానే మానవత్వం ఉందా అనిపించకమానదు.

ఓ అంబులెన్స్ రయ్ రయ్ అంటూ దూసుకెళుతుంది. అందులో ఐదు నెలల చిన్నారి ఉంది. తీవ్ర అస్వస్థకు గురవ్వడంతో.. ఆక్సిజన్ సపోర్టుతో ఆసుపత్రికి తీసుకెళుతున్నారు. పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో అంబులెన్స్ డ్రైవర్ వేగాన్ని పెంచాడు. సాధారణంగా ప్రాణాలను కాపాడే ఈ వాహనం.. సిగ్నల్ వేసుకుంటూ వస్తుందంటే.. ఎవరో ఆపదలో ఉన్నారని గ్రహించి.. దారి ఇస్తుంటాం. కానీ రోడ్డున పోయిన పోకిరీలు మాత్రం.. తమ వాహనాన్ని ఓవర్ టేక్ చేసిందన్న అసహనంతో.. అంబులెన్సుకు అడ్డువెళ్లి.. డ్రైవర్‌ను చితకొట్టారు. పసిపాప ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుందని, వదిలిపెట్టాలని తల్లిదండ్రులు మొరపెట్టినప్పటికీ కనికరించలేదు ఆ ఆగంతకులు. మానవత్వాన్ని ప్రశ్నించేలా ఉన్న ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

తమ కారును అంబులెన్స్ ఓవర్ టేక్ చేసిందన్న అక్కసుతో ఇన్నోవా వాహనంలోని వ్యక్తులు.. అంబులెన్స్ డ్రైవర్‌పై దాడి చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఓ ఐదు నెలల పసి పాపను ఆక్సిజన్‌ సపోర్ట్‌ తో బెంగళూరులోని వాణి విలాస్ అనే ఆసుపత్రికి అంబులెన్స్‌‌లో తరలిస్తున్నారు. చిన్నారిని సకాలంలో చేర్చాల్సి ఉన్న నేపథ్యంలో.. డ్రైవర్ జాన్.. అంబులెన్స్‌ను రోడ్డుపై పరుగులు పెట్టించాడు. బెంగళూరు-తమకూరులోని నేల మంగల టోల్ ఫ్లాజా వద్ద అంబులెన్స్.. ఇన్నోవా కారును ఓవర్ టేక్ చేసింది. తమ వాహనాన్ని కారు ఓవర్ టేక్ చేయడంతో తట్టుకోలేక పోయిన ఇన్నోవా కారులోని వ్యక్తులు.. సుమారు ఆరు కిలోమీటర్ల వరకు అంబులెన్స్‌‌ను అనుసరించారు. అంబులెన్స్‌‌ను ఓవర్‌ టేక్‌ చేసి అడ్డుకున్నారు. అంబులెన్స్‌ డ్రైవర్‌‌ను తీవ్రంగా కొట్టారు. తమ పాప పరిస్థితి సీరియస్‌గా ఉందని, అతడ్ని వదిలేయాని పాప తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకున్నా వదల్లేదు. పోలీసుల జోక్యంతో అతడ్ని విడిచిపెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Show comments