ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు! ఇంట్రెస్టింగ్ టైటిల్ తో..

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు! ఇంట్రెస్టింగ్ టైటిల్ తో..

  • Author Soma Sekhar Published - 09:14 PM, Fri - 24 November 23

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా పేరొందిన ఓ విలక్షణ నటుడి కొడుకు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఆ స్టార్ కిడ్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ యాక్టర్ గా పేరొందిన ఓ విలక్షణ నటుడి కొడుకు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఆ స్టార్ కిడ్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 09:14 PM, Fri - 24 November 23

చిత్ర పరిశ్రమలోకి వారసులు రావడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల కొడుకులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. కొందరు హీరోలుగా రాణిస్తుంటే.. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇక ఇదే కోవలోకి రాబోతున్నాడు విలక్షణ నటుడి కొడుకు. ఏకంగా హీరోగా వెండితరకు పరిచయం కాబోతున్నాడు. స్టార్ ఫైట్ మాస్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆ స్టార్ కిడ్ ఎవరు? ఆ మూవీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఫైట్ మాస్టర్ అనల్ అరసు డైరెక్టర్ గా మారాడు. అతడి డైరెక్షన్ లో ‘ఫీనిక్స్’ అనే మూవీ ప్రారంభం అయ్యింది. ఇక ఈ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు విజయ్ సేతుపతి తనయుడు సూర్య. యాక్షన్, స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. బ్రేవ్ మ్యాన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాకు కెమెరా మెన్ గా వేల్ రాజ్, ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక మూవీ లాంఛ్ కార్యక్రమంలో విజయ్ సేతుపతి కొడుకు సూర్య మాట్లాడుతూ..” నేను మా నాన్న దారిలో వెళ్లాలనుకోవడం లేదు. నాదైన వే లో నేను వెళ్దామని రెడీ అయ్యాను. అందుకే మేకర్స్ ‘ఇంట్రడ్యూసింగ్ సూర్య’ అని అంటున్నారు తప్ప.. సూర్య విజయ్ సేతుపతి అనడం లేదు. ఇక నేను హీరోగా నటిస్తుండటంపై అమ్మా, నాన్న చాలా ఆనందంగా ఉన్నారు” అంటూ చెప్పుకొచ్చాడు సూర్య.

కాగా.. అనల్ అరసు శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, బ్రూస్ లీ, లవకుశ లాంటి భారీ చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలు సమకూర్చాడు. షారుఖ్ ఖాన్ తాజా బ్లాక్ బస్టర్ జవాన్ కూ ఆయన పనిచేశారు. అయితే సూర్య కు నటన కొత్తేమీ కాదు. అతడు నేనూ రౌడీనే, సింధుబాద్, విడుదలై పార్ట్ 2 చిత్రాల్లో కనిపించి మెరిపించాడు. మరి విజయ్ సేతుపతి కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments