Maharaja Vijay Sethupathi Movie Review Rating in Telugu: మహారాజగా వచ్చిన విజయ్‌ సేతుపతి.. సినిమా ఎలా ఉందంటే..!

Maharaja Movie Review: మహారాజగా వచ్చిన విజయ్‌ సేతుపతి.. సినిమా ఎలా ఉందంటే..!

Maharaja Movie Review: తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ సినిమాగా తెరకెక్కిన మహారాజ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..

Maharaja Movie Review: తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కెరీర్‌లో 50వ సినిమాగా తెరకెక్కిన మహారాజ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..

మహారాజా

14/06/2024, U/A
యాక్షన్
  • నటినటులు:విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, అభిరామి
  • దర్శకత్వం:నిథిలన్ స్వామినాథన్
  • నిర్మాత:జగదీష్ పళనిసామి, సుధన్ సుందరం
  • సంగీతం:బి. అజనీష్ లోక్‌నాథ్
  • సినిమాటోగ్రఫీ:దినేష్ పురుషోత్తమన్

3

విజయ్‌ సేతుపతి.. హీరోగా కాదు.. మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ.. కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ఇక ఆయన కెరీర్‌లో 50వ సినిమాగా మహారాజ తెరకెక్కింది . నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే..

కథేంటి..

మహారాజ ఓ సామాన్య వ్యక్తి. సెలూన్‌ షాప్‌ నడుపుకుంటూ బతుకుతాడు. భార్య చనిపోతుంది.. కుమార్తెతో కలిసి జీవిస్తుంటాడు. కుమార్తె చిన్నగా ఉన్నప్పుడు జరిగిన ఓ యాక్సిడెంట్‌లో మహారాజ భార్య మరణిస్తుంది. ఓ ఇనుప చెత్తబుట్ట.. అతడి కుమార్తె ప్రాణాలు కాపాడుతుంది. దాంతో ఆ చెత్తబుట్టకు లక్ష్మి అనే పేరు పెట్టి.. ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ చెత్తబుట్ట పోతుంది. కుమార్తె స్పోర్ట్స్‌ క్యాంప్‌ పాల్గొనడానికి వెళ్తుంది. తను వచ్చేలోపు లక్ష్మిని  వెతికి పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు.

మహారాజ చెప్పి విషయం విని పోలీసులు అవాక్కవుతారు. చెత్త బుట్ట పోవడం ఏంటి.. దాన్ని వెతకడం కోసం పోలీసులకు ఫిర్యాదు చేయండ ఏంటో అర్థం కాక తలపట్టుకుంటారు. దాంతో పోలీసులు మహారాజ మీద అరుస్తారు. కానీ అతడు మాత్రం అక్కడ నుంచి కదలడు. కావాలంటే డబ్బులు ఇస్తాను అంటాడు. అతడి మొండి వైఖరి చూసి పోలీసులు డూప్లికేట్‌ చెత్తబుట్ట కోసం ట్రై చేస్తుంటారు. ఇక మరోపక్క సెల్వం (అనురాగ్‌ కశ్యప్‌).. తన ఫ్రెండ్‌తో కలిసి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మరి సెల్వంకు, మహారాజాకు సంబంధం ఏంటి.. ఆ చెత్తబుట్ట దొరికిందా.. దాన్ని వెతకడం కోసం పోలీసులు ఏం చేశారు.. స్పోర్ట్స్‌ క్యాంప్‌కు వెళ్లిన మహారాజ బిడ్డకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అన్నదే మిగతా కథ.

విశ్లేషణ..

చెత్తబుట్ట పోయిందంటూ కంప్లైంట్‌ ఇవ్వడం సినిమాను ఆసక్తికరంగా మార్చింది. ప్రథమార్థం అంతా మహారాజ గురించి, అతడి చెత్తబుట్ట గురించి చూపిస్తూ కామెడీగా కథను నడిపించారు. మరో పక్క సెల్వం దొంగతనాలు చూపించారు. ఇక ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ సెకండాఫ్‌ మీద ఆసక్తిని పెంచుతుంది. అయితే స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకోవడంతో సెకండాఫ్‌ స్టార్టింగ్‌లోనే కథ అర్థమైపోతుంది. ట్విస్టులు రివీల్ చేస్తూ వస్తుండటంతో సెకండ్ హాఫ్ మధ్యలోకి వచ్చేసరికి క్లైమాక్స్ కూడా ఊహించొచ్చు. దీంతో స్క్రీన్ ప్లే బాగుంది అనిపించినా చివరకు వచ్చే సరికి నార్మల్‌ స్టోరీనే కదా అనిపిస్తుంది. ఇక మూవీ ఎండింగ్‌లో మంచి ఎమోషన్స్‌ చూపించారు.

ఎవరెలా చేశారంటే..

ఇక నటీనటుల యాక్టింగ్ విషయానికి వస్తే.. విజయ్ సేతుపతి నటన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎలాంటి పాత్ర అయినా సరే..దానిలో ఒదిగిపోయి.. నూటికి నూరు శాతం జీవించేస్తాడు. ఇక మహారాజ ఆయన కెరీర్‌లో తన 50వ సినిమా. ఇక ఈసినిమా కోసం మాములు మధ్యతరగతి తండ్రి కథ ఎంచుకోవడం విశేషం అయితే విజయ్‌ సేతుపతి ఆ పాత్రలో జీవిచడం మరో ఎత్తు. మహారాజ పాత్రలో విజయ్ సేతుపతి అదరగొట్టేసాడని చెప్పొచ్చు. తమిళ యువ హీరోయిన్ దివ్యభారతి గెస్ట్ పాత్రలో కనిపిస్తుంది. సెల్వంగా అనురాగ్ కశ్యప్ మరోసారి తన విలనిజం చూపించాడు. ఇక సెల్వం భార్య పాత్రలో అభిరామి మెప్పిస్తుంది. మమతా మోహన్ దాస్ స్కూల్ పీటీ టీచర్‌గా పర్వాలేదనిపిస్తుంది. తమిళ్‌ సినిమా కావడంతో.. మిగతా పాత్రల మనకు పెద్దగా ఎక్కవు.

టెక్నికల్‌ అంశాలు..

మహారాజ సినిమాకి స్క్రీన్‌ ప్లేనే ప్రధాన బలం అని చెప్పవచ్చు. చాలా సింపుల్‌ కథని.. సరికొత్త స్క్రీన్‌ ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేసేలా తెరకెక్కించడంలో దర్శకుడు విజయం సాధించాడు. సింపుల్‌ స్టోరీనే కానీ.. దాన్ని ప్రేక్షకులకు నచ్చేలా ఆసక్తికరంగా మార్చి హిట్టు కొట్టారు. ఇక సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ పరంగా కూడా సినిమాకి బాగానే ఖర్చు పెట్టారని తెరపై కనిపిస్తుంది.

బలాలు:

  • సరికొత్త స్క్రీన్‌ప్లే
  • విజయ్‌ సేతుపతి యాక్టింగ్‌

బలహీనతలు:

  • తెలిసిన కథే కావడం
  • అక్కడక్కడ సాగతీత

చివరి మాట.. సరికొత్త స్క్రీన్‌ ప్లేతో మహారాజ మాయ చేశాడు.

Show comments