Maharaja OTT: విజయ్ సేతుపతి మహారాజ మూవీ రాబోయేది ఆ OTT లోకే.. కానీ !

Maharaja OTT: విజయ్ సేతుపతి మహారాజ మూవీ రాబోయేది ఆ OTT లోకే.. కానీ !

థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయని మూవీ లవర్స్ ఫుల్ ఖుషి అయిపోతుంటారు. కానీ ఓటీటీ లవర్స్ మాత్రం ఆ సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తాయా అని సెర్చ్ చేసే పనిలో ఉంటారు. ఈ క్రమంలో తాజాగా థియేటర్ లో రిలీజ్ అయినా మరో సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది.

థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయని మూవీ లవర్స్ ఫుల్ ఖుషి అయిపోతుంటారు. కానీ ఓటీటీ లవర్స్ మాత్రం ఆ సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తాయా అని సెర్చ్ చేసే పనిలో ఉంటారు. ఈ క్రమంలో తాజాగా థియేటర్ లో రిలీజ్ అయినా మరో సినిమాకు సంబంధించిన ఓటీటీ అప్ డేట్ వచ్చేసింది.

ఇప్పుడు ఓటీటీ సినిమాలకు ఓ రేంజ్ లో ఆదరణ పెరిగిపోయింది. ఒకప్పుడు సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత ఆయా సినిమాలు ఏ ఓటీటీ లోకి వస్తున్నాయి. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు అనే టాక్ వినిపించేది. దానికి ప్రేక్షకులు ఆశ్చర్యపోయేవారు. కానీ ఇప్పుడు థియేటర్ లో ఆయా సినిమాలు రిలీజ్ అయిన వెంటనే వాటి స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కన్ఫర్మ్ అయిపోయి.. అవి ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతాయి అనే ఊహాగానాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఈ క్రమంలో తాజాగా విజయ్ సేతుపతి నటించిన మహారాజ సినిమా జూన్ 14 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక అప్పుడే ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ బజ్ మొదలైపోయింది. మరి ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకుందో చూసేద్దాం.

దాదాపు థియేటర్స్ వరకు వెళ్లకముందే ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ఫిక్స్ అయిపోతున్నాయి. ఇక ఇప్పుడు విజయ్ సేతుపతి నటించిన మహారాజ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కూడా భారీ ధరలకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఈ సినిమాకు నితిలన్ స్వామినాథన్ దర్శకుడిగా వ్యవహరించారు. విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, అభిరామి, భారతి రాజా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా ఈ సినిమా.. ప్రస్తుతం థియేటర్స్ లో హిట్ టాక్ నే సంపాదించుకుంటుంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమాకు థియేటర్స్ లో ఎలాంటి స్పందన లభిస్తుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా నెల లోపే ఓటీటీ బాట పడుతున్నాయి. కానీ ఈ సినిమా ఓటీటీ కి రాడానికి మాత్రం కాస్త సమయం పడుతుందని చెప్పి తీరాలి. లేదా థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని.. నెలలోపే ఓటీటీ లోకి వచ్చి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా విజయ్ సేతుపతికి మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోగా , విలన్ గా ఎన్నో సినిమాలలో అలరించారు విజయ్. ఇక ఈ సినిమా విషయానికొస్తే .. ఇదొక మంచి థ్రిల్లర్ సినిమా.. కథ ముందుకు కదిలే కొద్దీ ఏ సీన్స్ చూసి ప్రేక్షకులు నవ్వుకుంటారో.. అవే సీన్స్ కాస్త కంటతడి కూడా పెట్టిస్తాయి. ట్విస్ట్ లు కూడా బాగానే ఉన్నాయి. అసలు ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుంది అని తెలుసుకోవాలంటే మాత్రం.. థియేటర్స్ లో ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments